చలం- అచలం

నిన్నందరూ ఆరాధించామంటారు
మళ్లీ అర్ధం చేసుకోరెవరూ 
ఇన్ని సంవత్సరాలు గడచినా 
వాళ్ళ కంటే నువ్వే ముందున్నావంటారు
నువ్వు ముందున్నావో 
మేము వెనుకపడ్డ జాతిలోనే ఉన్నామో
తెలుసుకోవాలని ప్రయత్నించేలోగా…
నువ్వు తనకి బాగా అర్ధం ఆయ్యావంటారింకొకరు
మందలో ఆ సొంత గొంతుకేవరిది అని వెతికేలోగా 
అసలు ఆడదానికి స్వాతంత్రం శుద్ధ దండుగ 
అని నివేదికలా నినదిస్తారింకొకరు 
అయ్యో! చలం అంటే కేవలం స్త్రీ స్వతంత్రం 
మాత్రమే కాదండి..
అని సమర్ధించేలోగా..
నీ జీవిత శల్య పరీక్ష సాగిస్తారింకొకరు..
ఈ గందర గోళంలో…చిందర జాలంలో 
నీ సశిరేఖలూ ఊర్వశులూ బలాదూర్! 
అయినా మానవి లైన వారికీ గోలంతా ఎందుకులే …
మనసు లేని మనుషులకి గాని!!! 

అయినా ఈ ఆటంతా అవగతమౌతోండా..?
అరుణాచలం లో అచలంగా ఉన్నా..
మా భయాలు మాకున్నాయి స్వామీ!
అంతా నిజం చెప్పేస్తే ఇంకేమైనా ఉందా!!
కౌపీన సంరక్షణార్ధం ..సర్వం… అని చెప్పినట్లు..

వదిలేయి మమ్మల్నిలా…
అందంగా అబద్ధపు యవనికలో 
శరీరమే తప్ప ఆత్మ లేని యువతిలా..

–సాయి పద్మ

ప్రకటనలు

One Comment Add yours

  1. lakshman అంటున్నారు:

    అద్భుతమైన పదజాలం అత్యద్భుతమైన భావజాలం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s