వొంటరితనం…జెండర్ ప్లీజ్!!

 

నిరాసక్త నిర్ణయ ప్రపంచంలో..నువ్వే రారాజువి!!
పొగిలి పొగిలి ఏడ్చే వీలు లేదు..నువ్వు మగాడివి 
గతమస్తక దిగంతాలు..ఇప్పుడు హస్తిమ శకాంతాలు
పూర్వ ప్రణయాలు…అనాఘ్రాత పరిచయాలు 
నేడు..అస్పృశ్య అసహ్యాలు.. 
సమాజం నెత్తి మీద జ్వలిత దీపం.. పక్కనే రుసరుసల కోపం..
మార్మిక రాత్రులన్నీ…వ్యవహారిక సంబంధాలు
వత్తిడి లేకుండా వత్తిగిల్లెట్టుగా… 
పగలంతా రక రకాల యాంత్రిక ఉద్యోగ ముసుగులు ..
నిద్ర రాని నిశీధిలో…అంతర్జాల ప్రేమల విసుగులు..
ఒంటరితనమా..ఏమిటి నీ అసలు చిరునామా?? 
అనికాదు ప్రశ్న..ఇంత ప్రేమల్లో…ఇంతమంది సన్నిహితుల్లో
కాంతలకు చెందని ఏకాంతంలో..
చెంతనే ఉన్న..ఊపిరి సలపని కార్య కలాపాలలో..
నీకింకా చోటెక్కడ అని..
ఏమో! నువ్వు అడుగుపెట్టగానే 
చెమ్మగిల్లిన నయనాన్ని…చెదరిపోని జ్ఞాపకాల మధురోహల్ని అడగాలేమో!! 
–సాయి పద్మ 
ప్రకటనలు

2 Comments Add yours

  1. Jagaddhatri అంటున్నారు:

    excellent poem very crisp and carrying loads of meaning….loved it ..fantabulous….lots of love j

  2. uday అంటున్నారు:

    కొంచెం అర్థం కాలేదు సాయమ్మా………… భావం బరువుగా ఉంది… పదాలు తేలికే……..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s