బానిసత్వపు కలలు

బానిసత్వం గురించి ఆలోచించలేదు ఇన్నాళ్ళూ 

మనకు సంబంధించిన విషయం కాదులే అని..

తరతరాల కండిషనింగ్..ని తెలుగు లో ఏమనాలో తెలీక 
చాలా ప్రగతి సాధించాం మనం.. 
రోట్లో రుబ్బే బదులు.. అలవోకగా గ్రైండర్ వేసేదాకా 
ఎంత గర్వంగా ఉంటుంది కదూ!!
సంపాదిస్తూ ఉంటె…
చకా చకా చెక్కులపై చెల్లె సంతకమంత గర్వం..
మొత్తం విత్తమంతా అతగాడి చేతిలో ఉంటేనేం..
సంతకం మనదే కదా..!!
ఉసురు తీసేంత ఉరుకులతో పరిగెత్తే పనమ్మాయి దగ్గరనుండి 
పగలూ రాత్రీ తేడా లేకుండా పనిచేసే ఆధునిక మహిళా యంత్రం వరకూ..
అందరూ.. వాళ్ళ వాళ్ళ జీవిత విధానానికి ఇంత బానిసలా అని…
ముందు కాలమే నయం లా ఉంది..
రోట్లో తల తెలిసే దూర్చారు..
అత్తింటి ఆరళ్ల రోకళ్ల పోట్ల్లలో..సాగించారు ప్రయాణం!!
స్వతంత్రమనుకొనే తంత్రం ఇంత యాంత్రికంగా ఉంటుందని తెలీక
ఎక్కువ చదివేసుకున్నాం మనం..
మన గురించి మన నిజమైన కలల గురించి ఆలోచించే సమయం లేనంతగా!!
అన్నట్లు కలలైనా.. సొంతమే కదా!! 
మనకి మనం బానిసలుగా ఉన్నంత కాలం కళ్ళు మూసినా కలలు కనద్దు దయ చేసి!! 
–సాయి పద్మ 
ప్రకటనలు

2 thoughts on “బానిసత్వపు కలలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s