నిద్రాక్షరాలు…

ఏది గొప్పది?.. నిద్రా? నిద్ర లేమా??
ఏమో అర్ధం కాలేదు..
పొత్తిళ్ళ పానుపుల సానుపుల నుండి..
వివిధాలైన వ్యక్తిత్వ వివశాల నుండి…
నన్ను వశం చేసుకొనే నిద్రంటే..
నాకు ప్రేముండడంలో ఆశ్చర్యం లేదు..
కానీ ఈ నిద్ర లేమి పై మొహం ఏమిటో అర్ధం కాలేదు
నేను మొహించేకొద్దీ దూరం జరుగుతోంది అది…
అస్తిత్వం ఓడిపోయిన ఆడపిల్లలా..
కళ్ళల్లో ఆందోళన వత్తులు వెలిగిస్తున్న అమ్మలా..
విపరీత కాంక్షా భ్రమనాలూ..జ్ఞాన విస్ఫోటనాలూ
వైరాగ్య చేతనలూ..జరిగిందీ నిద్రలేమి లోనే 
ఈ నీరవ నిశ్శబ్ద నిశీధికి నేనంటే వెర్రి ప్రేమ..
ప్రగాఢ పరిష్వంగం లో కూడా..
నన్ను నేను ఆవిష్కరించుకునేలా చేసింది..
నిత్యం మరచిపోతున్న చేతనని గుర్తుచేస్తోంది..
ఔషధ నిద్ర నుండి.. నిజం నిద్ర నన్ను చుట్టుకుంటోంది..
అమ్మ ప్రేమ పోత్తిల్ళలా..
కాంక్షా రహిత సహచర రక్షా కవచం లా..
— సాయి పద్మ 
ప్రకటనలు

2 Comments Add yours

  1. sphoorty1 అంటున్నారు:

    ఎప్పట్లే అద్భుతం….శ్రీ శ్రీ లా మీ వ్రాతలకు ఏవీ అతీతం కాదని మరో మారు ఋజువైంది పద్మాజీ…..

  2. Babu Koilada అంటున్నారు:

    బాగుందండి మీ తమ్మిమొగ్గలు బ్లాగు ..అలాగే మీ కవితలు కూడా బాగున్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s