గురజాడ-గురు’జాడ

నవయుగ వైతాలికుడవు అన్నారు..
నూరేళ్ళ పండగలూ చేసారు..
వేనోళ్ళ కొనియాడారు..విగ్రహాలు పెట్టించారు..
కళ్ళు మూసినా తెరిచినా.. దేశమంటే మట్టి కాదన్నారు
మేమే నన్నారు.. మనస్ఫూర్తిగానేమో..
మధురమైన వాణి తో  గొప్పగా చదివారు..
మహా పూర్ణోదయం.. మన కన్యా శుల్కం..
ఇంత గొప్పవాడు..మనవాడేనోయ్ అన్నారు..
ఇంత వరకు కుల ప్రస్తావన లేకుండా..
అప్పటినుండి ఒకటే పాట 
ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్..
దేశం కన్నా తమ అహాన్ని ప్రేమించే మనుషులు..
మధురవాణి లో అమ్మ తనాన్ని చూడలేని పురుషులు..
గిరీశంలా తప్పక తప్పించుకునే తెంపరి తెలివిపరులూ..
కర్మ సిద్ధాంతమే తమ ఖర్మ అనుకొనే బుచ్చేమ్మలూ
పూర్ణమ్మ కన్నా పుత్తడే ప్రాణం అనుకొనే కుటుంబీకులు..
ఈ శాషభిశాలనీ అయినాక 
ఇంక ఎక్కడ ఆవేశం..? అంతా నీరసం కాక..
దండలేసి దణ్ణాలు పెట్టగానే అయిపోతుందా ఆ మహనీయుని జాడ 
ఈ నాటికీ చర్చించుకున్న అవే సమస్యల వలయాల పొగలో 
చల్లగా నవ్వుతూనే ఉంటారు.. ఆ మానవతా వాది…
మమత, సమతా మనకు వీలుగా మర్చిపోయిన మనందర్నీ చూసి..
వందేళ్ళ దీర్ఘ నిద్ర నుండి ఇక నైన మేలుకుందామా..
గురు జాడలో మన మనసుని మేల్కొలుపుదామా..
వంద నుండి వేయి దాకా చేయి చేయి కలిపి 
నిజం చేద్దామా…? సమ సమాజం..మన సమాజం!!!

–సాయి పద్మ 
[గురజాడ వర్ధంతి సందర్భంగా..]

 

ప్రకటనలు

One thought on “గురజాడ-గురు’జాడ

  1. Dr. K. John Christopher అంటున్నారు:

    కవిత చాలా బాగుంది……….’శీర్షిక’ ఇంకా బాగుంది. గురజాడ ‘జాడ’ ని గుర్తుచేస్తూ రాసిన ఈ కవిత ‘జాడ’ కూడా అందరికి తెలియాలి. మంచి ఒక తెలుగు మేగజీన్ లో కూడా పబ్లిష్ అయితే ఇంకా బాగుండును.
    డాక్టర్ కే. జాన్ క్రిస్టఫర్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s