పేరు లేని చూపులు..

చూపులు..చూపులు..చూపులు..
జుగుప్స..చీదరపు..దులిపే చూపులు..
రేపూ మాపూ లేని.. ధిక్కార చీత్కార చూపులు..
ఒక్కసారి  ఈ భూమిలో కూరుకుపోతే బాగుండు..
మరొక్కసారి ఆ చూపుల్లో చల్లదనం తాకితే బాగుండు..
అంతా నువ్వే చేసుకున్నవంటూ అల్లంత దూరాన నిలబెట్టే చూపులు
మీరు వేరంటూ వేరు చేసే మ్యాపులు..
ఎంతకాలమైంది ఒక ఆదరపు చూపు కనిపించి..
కన్నీళ్ళతో మసకబారిన మస్తిష్కానికి 
అందటం లేదు.. ఆ చూపుల నిర్లక్ష్యం ఎన్నటిదో..
దాని వెనుక అసహ్యం ఆవల అసలు నిజమెంతో
అసలేప్పటినుండీ చూపుల తూటాలు..??
బ్రతుకు బండి లాగుతూ అలసినప్పుడా..
మద్య’మాపు వేళల్లో ఆదమరచినప్పుడా..?
పడుపు పడతి యాంత్రిక సుఖంలో ములిగినప్పుడా..
తెలియరాని జ్వరాలతో కుమిలినప్పుడా..
అనుమానపు పరీక్షలో అసలు నిజం తేలినప్పుడా..?
అచ్చంగా అంటరానితనం అనుభవించినప్పుడా..?
ఏమో….
ఆవిరైపోయిన కలల సాక్షిగా..ఊహకి కూడా అందని నిజం సాక్షిగా 
అవగతం కాలేదు ఇప్పటికీ…
నా చావు… 
ఈ జబ్బు వల్లా..?
ఈ చూపుల తూటాల దెబ్బ వల్లా??

[” ఎయిడ్స్ జబ్బు కన్నా, ఈ చూపులతో రోజూ చచ్చిపోతున్నాం తల్లీ!! కనీసం మీరు పెంచుకొనే కుక్క లాగాన్నా  చూడండి..!! ఒక ఎయిడ్స్ బాధితుని బాధ ప్రేరణతో! జాలి లేని చీత్కర చూపులకు తెర వేస్తారన్న ఆశతో.. ప్రపంచ ఎయిడ్స్ బాధితుల దినోత్సవం సందర్భంగా”]

 

ప్రకటనలు

2 thoughts on “పేరు లేని చూపులు..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s