ఎందుకు నాన్నా..ఇదంతా..?

నాకేం తెలియట్లేదు నాన్నా..
నేను చేసిన తప్పేంటో..
మన మధ్యన ఈ ఖాళీ సీసా ఏంటో..
కానీ నా చుట్టూ అంతా నవ్వులే..
వెటకారపు..వెళాకోలపు నవ్వులు..
ఈ నవ్వు నా ప్రాణం తీస్తోంది నాన్నా..
నవ్వుల మంటల్లో నా ఊపిరి ఆడటం లేదు..
ఆ నవ్వుల్లో నేను నవ్వటం మర్చిపోయినా 
బాధ లేదు నాన్నా..!!
ఆ నవ్వుల తో నేను చేసే దెబ్బలాట చూసి
నా దెబ్బలు తడిమి..
అమ్మ కళ్ళలో ఏడ్పు.. నాకు భయమేస్తోంది..
ఎందుకు నాన్నా ..ఇదంతా..!!
అందరూ నన్నే చూస్తున్నట్లు..నా గురించే మాట్లాడుతున్నట్లు 
అయోమయంగా ఉంది…
కలల నిండా సీసాలే నాన్నా..
ఇల్లు అంతా సీసాల మయం..
నడవాలంటే గుచ్చుకుంటాయని భయం..
ఖాళీ సీసాల అవతల నువ్వు..ఇవతల నేను..
నడవకుండా నిన్ను చేరేదెలా నాన్నా..
నువ్వు మారేది ఎలా నాన్నా..
నాకు పారిపోవాలని ఉంది నాన్నా..
సీసాలు లేని చోటకి..
నవ్వులు వినబడని దీవికి..
అమ్మని వదిలేదేలా..? నిన్ను చూసేదెలా..?
వళ్ళంతా చూపుల ముళ్ళు నాన్నా! 
ఇవాళో వెటకారపు నవ్వు అన్నదీ..
“చెడ్డపిల్లల నాన్నలు తాగుబోతులు..!”
నిజంగా చెప్పు నాన్నా? నేనంత చెడ్డదాన్నా?
[కులం,మతం.ప్రాంతం..ఇలా ఏ రకమైన విభేదం లేకుండా ..ఆగలేని  అభివృద్ధిలో ఉన్నారు..ఆల్కహాలికులు…వారికి బలి అవుతున్న చిన్న పిల్లలందరికీ నా ఈ చిన్ని కవిత!] 
ప్రకటనలు

4 thoughts on “ఎందుకు నాన్నా..ఇదంతా..?

  • kslkss అంటున్నారు:

   THAAGANI VALLAKU CHAALA BAAGUNTUNDI. NAAKU CHAALA CHAALA BAAGUNDI. MANASUKAVI CHEPPINADAANI SPHOORTHITHO “CHADIVITHE MARACHIPOGALANU CHADUVANIVVADU, MARACHIPOTHE CHADUVAGALANU, MARUVANIVVADU.” YADHA RAAJA, THADHA PRAJA. KAASULAKOSAM KAKKURTHI PADI, MANA MARYAADALANU MANTAGALUPUTHUNNA ROJULLO, ENDUKEE AAKROSAM, EVARU THEERUSTHAARNI EE AAVEDANA! BADULU, GUDULU VUNNACHOTE BAARLU, BAARULU THEERUSTHUNTE, NIGGATHEESI ADIGE MAGATHANAM ENAADO MANTAKALASIPOTHE, PILLALA BATHUKULA CHITHUKULALO LINGA BHEDAM LEDU, VAAVI VARUSALU LEVU, SIGGU EGGULU LEVU, PEDDATHANAANIKI PAADE KATTI, PASU PAALAKULA PAALANALO, PASIKANDULU EDCHI, EDCHI, KANNELLA KADALILO KADATHERI POVALASINADE. PUTTUTE PAAPAM, IKA PAAPAMEMITI?

 1. శోభ అంటున్నారు:

  “ఖాళీ సీసాల అవతల నువ్వు..ఇవతల నేను..
  నడవకుండా నిన్ను చేరేదెలా నాన్నా..
  నువ్వు మారేది ఎలా నాన్నా..”…….. పసిపిల్లల మనసుకు అద్దంపట్టేలా ఉందీ కవిత సాయికమల గారు. తాగుడు రక్కసి కోరల చిక్కుకున్న వాళ్ల కుటుంబాల్లో పరిస్థితి నాక్కూడా ఎరుకే.

  ఇటీవలే మా బంధువుల అమ్మాయి పెళ్లి జరిగింది. ఆ అమ్మాయి నాన్న తాగుబోతు. వాళ్ల అమ్మే ఆ అమ్మాయిని, తన చెల్లెలిని ఏదోలా కష్టాలు పడి పెంచి, పెద్ద చేసింది. ఎలాంటి పనీ చేయని అతను తాగుడే లోకంగా బ్రతికేస్తుంటే, తెలిసిన వాళ్ల సాయంతో వాళ్ల అమ్మ ఆ అమ్మాయికి పెళ్లి చేసింది. పెళ్లయిన మూడు రోజులకే ఆ అమ్మాయి తండ్రి భార్యను చితగ్గొట్టి, చెవి తెంపేశాడు. మరుసటి రోజున అత్తవారింట్లో పూజ. మీ తల్లితండ్రులను పిలుచుకురమ్మని ఆ అమ్మాయితో చెప్పారు. ఫోన్ చేస్తే, విషయం తెలిసి బావురుమంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది, అత్తవారింట్లో తను సుఖంగా ఉండగలదా, అమ్మ గురించి కలవరపడదా..?

  మత్తు వదలని తాగుబోతులకు ఈ పరిస్థితి అర్థమయ్యేదెలా.. చిన్న పిల్లలనుంచి పెరిగి, పెద్దయ్యి అత్తవారింటికి వెళ్ళినా మారని తండ్రులను మార్చేదెలా…? అన్నీ జవాబులు లేని ప్రశ్నలే. వారంతట వారే మనసు మార్చుకుని మత్తుకు దూరమయ్యేదాకా, ఇలాంటి అమ్మాయిల మనసు ఘోష ఆగదేమో…??!!!

 2. రాజశేఖర రాజు అంటున్నారు:

  హృద్యంగా, ఆర్ద్రంగా ముగిసిన మీ కవిత ఒక ఎత్తైతే మీరు ఎంచుకున్న ఫోటోలు మరొక ఎత్తు. ఆల్కహాలికుల పిల్లల మనోవేదనను పట్టి చూపిస్తున్నట్లున్నాయవి.
  “చెడ్డపిల్లల నాన్నలు తాగుబోతులు..!”
  నిజంగా చెప్పు నాన్నా? నేనంత చెడ్డదాన్నా?

  ఎక్కడో చెళ్లుమంటోంది.
  నేనంత చెడ్డదాన్నా?.. ఏ సమాజమైనా, ఈ చిన్ని ప్రశ్నకు జవాబు చెప్పగలుగుతుందా..?
  కలకాలం గుర్తుండిపోయే కవిత.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s