కుల’కలం…

కులం..దాన్ని గురించి రాయాలన్నా..

మాట్లాడాలన్నా..అందరికీ భయం..

 

కలాలకి కూడా కులాలుంటాయా??

 

“ఏ కులము నీదంటే??…” అని శ్రావ్యంగా పాడినా..

 

“గాలికి కులమేది?? ..” అని ఎలుగెత్తి అరచినా

 

మనసులో మైల భావనలా పట్టుకున్న …

 

వ్యాధిని ఏ ఉత్తుంగ తరంగాలతో తుడిచేయగలం??

 

ఏ సిరాక్షరాలతో కొట్టేయగలం..?

 

కానీ చేయాలనుకుంటే నిజంగా చేయలేమా??

 

ఏదన్నా చేయగలం కదూ??

 

అలవోకగా భుజం తట్టి జంధ్యాన్ని తడమగలం..

 

శైశవ దశ దాటని దళిత గీతంతో శివ తాండవం చేయగలం

 

ఇంటిపేరుతో….సర్వం తెలుసుకోగలం 

 

కులం లేదంటూనే..మనోడేక్కడా?? అని వెతగ్గలం..

 

తలచుకుంటే…తననుకుంటే..

 

మనసు పెడితే.. మధన పడితే..

 

ఏం చేయలేం??

 

కుల కాకులన్నింటినీ రెప్పపాటున చెదరగోట్టగలం

 

కలం ఝుళిపించి….ఝణ ఝణమని ఐక్య రాగం అలపించగలం..

 

తగలబెడుతున్న.. తరలిపోతున్న భావి తరాన్ని ఆపగలం…

 

వెనుతిరుగుతున్న …మేధావులను నిలదీయగలం 

 

సం’కుల భయం లేకుండా బ్రతగ్గలం..       

 

కలాల రవాలతో.. కాలాన్నే శాశించగలం..

 

కానీ…ఎలా..?

 

ఇంద్రజాలికుని పెట్టెలో బొమ్మలా.. 

 

విముక్తి కోసం చూసే వయసుడిగిన కొమ్మలా..

 

ఇంకా మనం కుల వాద పెట్టెలో..

 

కాళ్ళూ చేతులూ ముడుచుకు కూర్చున్నామే..?

 

అయినా..

 

రోజూ ఎదుగుతున్నామనుకునే మనం 

 

ఇమడని పెట్టెలో మరుగుజ్జులమైపోమూ??

 


 

–సాయి పద్మ మూర్తి 

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s