కవి గారి పెళ్ళాం…

నేనీ సంసారం వద్దనుకోలేదు..
నీ కవిత్వం కావాలనుకోలేదు..
అలసిన దేహాల ..అనంత ప్రయాణంలో
నీ అక్షరాల స్పర్శ నాకు తగలాలనుకున్నానంతే 
నా జ్ఞాపకాల, అనుభూతుల అగాధాల భయంలో
నీ జ్ఞానంతో..నాకింత ఆసరా అవుతావనుకున్ననంతే..!
నీ ప్రపంచంలో చిన్న మల్లె మొక్కలా సాకుతావనుకున్నానంతే..
మేధో విప్లవాల రణరంగానికి నువ్వు సమాయత్తమవుతుంటే ..
నా పెదాల వీర తిలకం నీకు అవసరమేమోనని ఆశపడ్డా అంతే..
కానీ…
నీ మస్తక పుస్తకంలో నేనొక పేజీని కాలేకపోయనా అనిపిస్తోంది..
మనసుగంధం, కాంక్షా తిలకం తేచ్చేలోగా నువ్వు వెళ్ళిపోయావు..
ఏనాడూ నువ్వు తలతిప్పి చూడని మల్లె మొక్కలా నే మిగిలిపోయా..
సరే కానీ మిత్రమా..
వెనుక వరుసలోనన్నా 
నీ మేధకు మురిసేది నేనే..
నిన్ను మదిని నిలిపేది నేనే..
–సాయి పద్మ 
ప్రకటనలు

4 thoughts on “కవి గారి పెళ్ళాం…

 1. వాసుదేవ్ అంటున్నారు:

  “అక్షరాల స్పర్శ” ఓహ్! ఇంత సున్నిత భావన అనుభూతించి చాన్నళ్ళయింది…నాకీ అదృష్టాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు..”పెదాల వీరతిలకం” లాంటి ప్రయోగాలు నాచేత మళ్ళి రాయించేలా ఉన్నాయ్!

 2. kavi yakoob అంటున్నారు:

  నీ కవిత్వం కావాలనుకోలేదు..
  అలసిన దేహాల ..అనంత ప్రయాణంలో
  నీ అక్షరాల స్పర్శ నాకు తగలాలనుకున్నానంతే
  ………….good poem….
  ee poem backgrond-‘aarthi”.adi reflect ayyindi poem anthaaa..good.!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s