ఆమె…

stock-photo-woman-face-with-multicolored-indian-pattern-holding-lotus-flower-side-view-digital-painting-76453153

ఆమె

నదీనదాల వాగుల వంకల ఝురి నే కాదు..

వాటి నీలినీడలను కూడా తన కళ్ళలో ప్రతిఫలిస్తుంది..

శ్రమైక జీవన సౌందర్యాన్ని శోధించి..సాధించి..

ప్రేమైక సహజీవనాన్ని ఆశించి భంగపడుతుంది..

ఆమె

కష్టాల ఒడిదుడుకుల అధిరోహణలో కూడా

తన అస్తిత్వాన్ని పదిలంగా కాపాడుకుంటుంది..

దేహాన్నే తప్ప ఆత్మను అంటని

అగ్ని లాంటి అహంలోఇష్టం లేని ప్రాయోపవేశం చేస్తుంది..

ఆమె

అసత్యాల అడుగుజాడల్లో..నిజాన్ని నిర్దేశిస్తుంది..

మోహపు మెరమెచ్చు మాటలను.. స్నేహంతో కట్టడి చేస్తుంది

కామపు కళ్ళను కరుణతో పరికిస్తుంది..

కుటిల మబ్బులను కాటిన్య వర్షంతో చెల్లా చెదురు చేస్తుంది

ఆమె..

యతి ప్రాసల తరగతులను దాటి..మమతల ఛందస్సును పల్లవిస్తుంది

మేధో మహా యజ్ఞంలో ..మనః పూర్వక సమిధ అవుతుంది

ప్రణయ ప్రభంధ నిబంధనలను నిర్దేశిస్తుంది ..

తన సాంప్రదాయాన్ని తానే రచిస్తుంది..!!

ఆమె..

అందమనే రజ్జు సర్ప భ్రాంతినిఆవిరి చేస్తుంది..

అధః పాతాళంలో ఉన్న మానవతను పరిపుష్టి చేస్తుంది

తనదైన స్త్రీత్వంతోతమస్సును తరిమేస్తుంది..

అనేక అస్తిత్వాలతో..ఉషస్సును వెలిగిస్తుంది…!!

సాయి పద్మ

banner4

ప్రకటనలు

4 Comments Add yours

 1. జాన్‌హైడ్ కనుమూరి అంటున్నారు:

  ఆమెకు శిరసువంచి నమస్కరిస్తున్నాను

 2. జాన్‌హైడ్ కనుమూరి అంటున్నారు:

  ఆమెకు శిరసువంచి నమస్కరిస్తున్నాను

  గొప్పగా అవిష్కరించారు

 3. వాసుదేవ్ అంటున్నారు:

  “ప్రణయ ప్రభంధ నిబంధనలను” మళ్ళీ మళ్ళీ చదివించే కొన్ని పదజాలాల్లో ఇవొకటి. ఇంప్రెసివ్ పద్మాజీ

 4. kastephale అంటున్నారు:

  అమె ఎవరో కాదు,జన్మ మృత్యు జరాతప్త జనవిశ్రాంతిదాయిని.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s