అతను…ప్రేమ…

DSC_0211

అతని ప్రేమ

మొహంలా వెల్లువెత్తి సాగర తీరాలని చేరాలనుకుంటుంది..

సమాజభయం మగత నిద్రలా స్ఫురణకు రాగానే.. నిశ్చల తటాకమవుతుంది..

పారని నీరులా గతం తాలుకా నాచులో నాట్యమాడుతుంది..

మేధకూ, మనసుకూ పోరాటంలో..జ్ఞాపకంలా ఆవిరవుతుంది..

 

అతని ప్రేమ

ఆశయాల అంచులలో ఆనందం కోసం వెతుక్కుంటుంది..

చంటి పిల్లాడికి స్తన్యంలాప్రేరణ కోసం శోధిస్తుంది..

సాధించిన ప్రేరణ.. అలవాటైన విసుగుకి కారణమవుతుంది..

క్షణ కాల నిర్వాణంలా మారిన ప్రేమ ..ఆడుకుని పారేసిన బొమ్మవుతుంది..

 

అతని ప్రేమ..

ఒక ప్రతి చర్యలా ..చర్య కోసం ఎదురు చూస్తుంది..

పరిచారకత్వమా..?.. రసికత కాదే..? అంటుంది

సహచర సహానుభూతిదిగంతరాల విహంగమవుతుంది ..

ఉత్ప్రేక్షకాలుగా మారిన వలపుతో ..ప్రేక్షకమవుతుంది..

 

అతని ప్రేమ

జీవన అలసట పోరుబాటల్లోదైనందిన పొరపాటు అవుతుంది..

అందుకోనున్న అప్రాప్త సుందరిలా ..అలా అలా ఊరిస్తుంది

వయస్సు లెక్కలతోనిట్టూర్పుల దండవుతుంది..

ఉచ్చ్వాస నిశ్వాసాల మాదిరిలోమరణమంత మమూలవుతుంది..

 

అతని ప్రేమ

ఒకే కప్పు క్రింద ఉండే.. వేరు వేరు ద్రుక్పధమవుతుంది..

అంతరాంతరాల్లో ఉన్న.. ఆశల అయుధమవుతుంది..

నాటకీయత రాని.. అనేకత్వమవుతుంది..

ఆహుతైన ఉష్ట్ర పక్షిలా..అద్భుత సాహిత్యమవుతుంది..

సాయి పద్మ

IMG_7330_virtual_marriage_500

ప్రకటనలు

5 thoughts on “అతను…ప్రేమ…

  1. Jagathi Jagaddhatri Dhatri అంటున్నారు:

    కవిత్వం అతి సహజంగా చెట్లు చివురులు వెసినంత సహజంగా రావాలంటాడు కీట్స్ నిజంగా నీ కవిత్వం లోని భవోద్విగ్నత తో బాటు సమతౌల్యత జీవం పరిశీలన నన్ను రోజురోజుకీ అబ్బుర పరుస్తున్నయి సాయి ….నిన్ను పొగడాలని లేదు నీ ప్రతి అక్షరాన్నీ పదే పదే చదువుకుంటూ గర్వంగా తృప్తిగా ఉండాలని ఉంది అతిశయం పలకడం నాకు రాదు ….నే చెప్పిన ప్రతి మాటా నా హృ ది పలికిందని నీకూ తెలుసు …..ప్రేమతో ….జగతి

  2. వాసుదేవ్ అంటున్నారు:

    మరోసారి మీరు అక్షరాలతో ఆడుకున్న తీరు ఆకట్టుకుంది. ఆ కట్టు మీకే సోంతం. మళ్ళే మీ భాషా ప్రభవంతో ఆ సబ్జెక్ట్కి అతికినట్టుగా సరిపోవడం మీ కలం కలకలం– వాసుదేవ్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s