ఆప్యాయ అప్పగింతల అప్పదాసు….సమ్మొహ’మిధునం !!

midhunam-1

ఓసోస్..భడవా ..మా విషయాలేవీ వినోద్దంటూనే..

బ్రతకటం ఎలానో చెప్తాడు…చెవులు తూట్లు పడినా బుచ్చిలక్ష్మికి..

శ్రవణానందకరంగా మనకీనూ…

తన విస్తరాకుల్లెక్క ఎక్కడయి పోతుందో అని అతని భయం అతనిది..

“దానికి చూపానదు…జారి పడితే నా ప్రాణానికొస్తుంది..”

అంటూ వెంట తిరిగే ..అప్పదాసు..

మెరుపు భయం..చీకటి భయం.. అర్దరాత్రి ఆకలైతే ఎలా?

అంటూ కచ్చ పోసి కట్టి ..కాన రాని చీకటిలో కూడా

కందట్లూ పొంగరాలూ వేయటానికి

సిద్ధమయ్యే…అప్పదాసు అర్ధాంగి బుచ్చిలక్ష్మి..

డెభ్భై ఏళ్ళనాటి… పంచుకుతిన్న శేనక్కాయల రుచి మహత్యం మరి..!

వీళ్ళిద్దరూ చెప్పే బతుకు పాఠం…కందా బచ్చలంత రుచిగానూ..

చెట్టుమీంచి చారులోకి దూకే కర్వేపాకంత ..ఘుమఘుమ గానూ ఉండదా మరి..?

లౌక్యం లేని మనలాంటి వాళ్ళంతా..

ఎలా ప్రేమించాలో..వాళ్ళ లేడీసుకి జడేసినంత రహస్యంగా..

వీపు తోమినంత సరసంగా… అప్పగిస్తాడు మనకి..

మనకు తెలియకుండానే ఆ వినోదంలో భాగమవుతాం..

పసుపు కుంఖాల కంటే…ప్రేమించాల్సింది ఏమిటో తెలుసుకుంటాం..

బులబులాగ్గా ఉన్న బంధాలనీ.. .పచ్చగా వాలిన పాదులా..

నిత్యంగా ఎలా ఉంచాలో తెలుసుకుంటాం..

అప్పదాసు చివరి శ్వాసకి వెన్నెల వస్త్రమైంది..

బుచ్చమ్మ కోరుకున్న కోరికలో అది మమేకమైంది..

ప్రేమాస్పద అర్ధనారీశ్వర తత్వం బోధపడింది.. !!

–సాయిపద్మ మూర్తి

 

[‘ మిధునం’ కధ చదివిన మత్తులో..గమ్మత్తులో.. ఈ సారైనా అప్పదాసు బ్రతకచ్చు కదా..అని ఆశ పడే శైల బాల గారి అంతరంగ అందం గుర్తుకొచ్చి..బ్రతికే ఉన్నాడు కదా మనకి బ్రతకటం ఎలానో..అని నేర్పిస్తూ..అనిపించి..!]

ప్రకటనలు

4 thoughts on “ఆప్యాయ అప్పగింతల అప్పదాసు….సమ్మొహ’మిధునం !!

  1. kastephale అంటున్నారు:

    మిధునం చదవాలని ప్రయత్నం దొరకలేదు, పల్లెలో, వినడాని ప్రయత్నం చేసా, కవిని( కనబడదు, వినబడదు) కష్టపడ్డా ఫలితంలేకపోయింది. ఎప్పటికి ప్రాప్తమో! బాగుంది.

  2. vennellogodavari అంటున్నారు:

    బ్రతికే ఉన్నాడు కదా మనకి బ్రతకటం ఎలానో..అని నేర్పిస్తూ..అనిపించి..!]
    పద్మ గారు మీరు చెప్పింది నిజ్జం అండీ చాలా బావుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s