ఆమె…ప్రేమ…

love-painting

ఆమె ప్రేమ

మనస్సాంతరాల్లోమరో జన్మకి సైతం సజీవంగా ఉంటుంది..

మారుతున్న మనుషులనిమనసారా స్వాగతిస్తుంది..

మనసున్న చోటమట్టిలో కలిసేవరకు శాసిస్తుంది..

మనఃక్షోభ కలిగిన తావుమరు నిమిషం మరణిస్తుంది

 

ఆమె ప్రేమ..

అధః పాతాళానికి కూడాఆశా జ్యోతి నిస్తుంది..

ప్రేమ అనబడే ఆమ్లదాడులలో  .. జ్వలిస్తూ దహిస్తుంది

శీలం అనబడే చంద్రమతీ మాంగాల్యాన్ని తీయకుండా భరిస్తుంది

మానం అనబడే అవమానాన్ని..కిమ్మనకుండా సహిస్తుంది..

 

ఆమె ప్రేమ..

రోజువారీ దినచర్యలా.. అగణితమవుతుంది..

సుతిమెత్తగా తగిలే మానసిక వత్తిళ్ళలోకరగని మంచుముద్దవుతుంది

శీతాకాల రోజ్జ గాలిలాతప్పనిసరి బాధవుతుంది

ఆహ్లాద స్నేహ సాయంతాల కోసంఆత్రంగా ఎదురు చూస్తుంది..

 

ఆమె ప్రేమ….

దేహంతో పాటు మనస్సంగమించనిఅసంఖ్యాక కలయికవుతుంది..

పులకరించ నోచుకోని ..పలకరింతవుతుంది..

మొహం తెప్పరిల్లనిదాహమవుతుంది

పలవరింతల బలవంతపు తెల్లవారవుతుంది

 

ఆమె ప్రేమ

ఆర్తి తో స్వీకరించ.. స్ఫూర్తి అవుతుంది

విధాత నెదిరించేశిలాక్షర చరితవుతుంది

వ్యక్తిలోని వ్యక్తిత్వానికి ..అస్తిత్వమవుతుంది..

వాదనతో విసిరికొడితే..వ్యధాత్రి గా మిగులుతుంది!!!

సాయి పద్మ

WomanInLove

ప్రకటనలు

One thought on “ఆమె…ప్రేమ…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s