అహం’కాళి….

143i7at

 

తరతరాల కధనం..కష్టానికి ఖననం..

నమ్మకానికో నరకం.. గోరోజనానికో నీరాజనం..

అలా అంటే ” పొగరు ఫలానా వాడికే ఉండాలా..?  ” అని అడిగేరు..

అదేమో తెలియదు గానీ..

మనిషిలో  అకారణంగా నిద్ర లేచే అహం అంటే

నాకు మొహం మొత్తిపోయింది

అకారణ ప్రేమ, ద్వేషాల గురించి విన్నాం గానీ..

అకారణ అహం కొంచం కొత్తగా… గమ్మత్తుగా ఉంది

రోజూ పలకరించే మిత్రులలో.. రాజుకుంటున్న కుంపట్లు..

విశేషం ఏమీ లేకుండానే ఎవరికి వారే వాయించుకుంటున్న త్రంపెట్లు..

ముక్కి మురికి వాసన కొడుతున్న నల్లధనంతో ఇనప్పెట్లు

ఎంతకీ వదలని అహం జిడ్డు లాంటి అంట్లు..

లేరే రాజుల్…రాజ్యముల్ అన్నారు గాని..

తరాజులైన అహరాజుల గురించి ప్రస్తావించినట్టే లేదు!!

చుట్టూ గర్వంతో మనుషులు.. భరించలేని మనసులు..

మాలిమితో పెంచుకుంటున్న అహాలు…హా హా కారాలవుతున్న సహాయాలు..

భరించలేనివన్నీ అలవాటయిపోతాయిలె అంటూ ఊరడించే అరుదైన నిశ్శబ్ద స్నేహాలు..

మంచి మనసులన్నీ ఒక్కసారిగా మౌనపు ఇరుసులో  కూరుకుపోతున్నట్లు..!

అహాల ఊబిలో దిగబడుతున్న మనుషులందరికీ..

వేయి నాల్కలై స్వాహా కాబడుతున్న వ్యక్త్తిత్వాలన్నిటికీ..

ఇహంలో అస్తిత్వ విముక్తి ఎప్పుడో…ఎన్నడో..

మళ్ళీ మరో అహంకారాన్ని చంపే మహంకాళి కావాలేమో…ఏమో..???

–సాయి పద్మ

ప్రకటనలు

2 thoughts on “అహం’కాళి….

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s