అతను- క్రోధం..

anger painting

 

అతని క్రోధం…

రుధిర భాష్పజలాల వరదవుతుంది..

దూరలేని తావులలో.. చెరపలేని శిలా ఫలకమవుతుంది..

అతని ప్రేమల జాడల్లో…తరించే తరుణుల నొసటన విధిగీతవుతుంది..

అతని మరణాంతరం.. నిద్రలో సైతం జలదరించే కలవరమవుతుంది


అతని క్రోధం…

అసూయా ద్వేషాల ఆనవాలవుతుంది…

వెటకారపు చిరునవ్వులా..తరగని మేధకు సమాధిగా మిగులుతుంది..

ఆగని జీవనగీతంలో..తప్పించలేని అపస్వరమవుతుంది..

నిక్కచ్చిగా ఇచ్చి పుచ్చుకునే సగటు కాపురమవుతుంది..

the-kiss

అతని క్రోధం…

ముసుగు తీయని మంచితనమవుతుంది..

మాట్లాడని నిస్తేజమవుతుంది..

మొహాన్ని ప్రేమతో కప్పెట్టగల సమర్ధతవుతుంది..

తెర తీయని.. ఎవరూ చేరని సుదూర తీరమవుతుంది…


అతని క్రోధం..

సహనత్వం పాలిట నిశ్శబ్ద నపుంసకత్వం అవుతుంది..

క్రమశిక్షణ పేరిట…ఉరి శిక్ష అవుతుంది..

సమాజపు నెత్తిపై భరించలేని బండరాయవుతుంది..

జ్వలించే రవికి…..తప్పక ఇవ్వాల్సిన చుంబనం అవుతుంది..


అతని క్రోధం..

ఇతరుల అస్తిత్వ రోదనని సైతం శృంగార కూజితం అంటుంది..

ప్రశాంతతని చేరుకోని…ఎడారి ఈదురు గాలవుతుంది..

భగ భగ మండే… వాయిదాల మరణనమవుతుంది..

దృతరాష్ట్ర ప్రేమలా…ఆహా’జ్యంలో సాయుజ్యమవుతుంది..

Many_Facets


–సాయి పద్మ


ప్రకటనలు

2 thoughts on “అతను- క్రోధం..

  1. saamaanyudu అంటున్నారు:

    ప్రశాంతతని చేరుకోని…ఎడారి ఈదురు గాలవుతుంది..

    భగ భగ మండే… వాయిదాల మరణనమవుతుంది..

    బాగా చెప్పారు పద్మగారూ…

  2. Dr. K. John Christopher అంటున్నారు:

    రుధిర భాష్పజలాల వరద, ముసుగు తీయని మంచితనమ, సహనత్వం పాలిట నిశ్శబ్ద నపుంసకత్వం, జ్వలించే రవికి…..తప్పక ఇవ్వాల్సిన చుంబనం, ఇతరుల అస్తిత్వ రోదనని సైతం శృంగార కూజితం……………..ఈ పదాల ప్రక్రియ చాలా గొప్పగా ఉన్నాయి. Appreciate చేయకుండా చేయకుండా ఉండ లేను. కానీ……..కొన్ని controversies వున్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s