బుజ్జి…ఆల్కహాలిక్ పిల్లల గురించి ఒక చేతన/అవగాహన

image    image

రచయిత్రి: శ్రీమతి. శ్రీదేవి మురళీధర్

సమీక్ష: సాయి పద్మ మూర్తి

అబ్బా.. ఈ విరిగిన మనుషుల్ని ఎలా అతకడం?? అని ప్రశ్నిస్తుంది..బుజ్జి..అమాయకంగా..ఆ బుజ్జి మరెవరో కాదు.. మీ, మా, మనందరి ఇళ్ళల్లో ఒక మద్యం అనే మహమ్మారి బారిన పడ్డ జబ్బు మనిషి ఉంటె, వాళ్ళ పిల్ల.

అందరిలాగ అమాయకంగా గడవాల్సిన బాల్యం, తండ్రి అలవాటు మూలంగా చిద్రమైతే, ఆ పసి మనసు పడే బాధ, అనుభవించిన వాళ్లకి గాని తెలియదు. చాల మందికి అక్కరలేని అవగాహనా లేని ఒక విషయాన్నీ గురించి రాయాలంటే, లేదా దాన్ని గురించి అవగాహన కల్పించాలంటే, చాల ధైర్యం కావాలి. అలాంటి ధైర్యం పుష్కలంగా గల అవనత ధీర శ్రీదేవి మురళీధర్ గారు.

ఇది ఒక సచిత్ర కథ. మొదటిసారి ఇలాంటి సామాజిక సమస్య మీద ఒక సచిత్ర,  చక్కటి బొమ్మల కథ ని నేను చూడటం జరిగింది. శ్రీదేవి గారి మొదటి పుస్తకం “ఆవిష్కరణ” గురించి నేను అంతర్జాలం లో చూసి ఆ పుస్తకం ఆవిడ దగ్గరనుండి తీసుకొని చదవటం జరిగింది. అదే మొదటి సారి నేను ఆల్కహాలిక్ సమస్య గురించి, మూలాలతో, వివరణలతో, ఎవర్ని సంప్రదించాలో కూడా తెలుపుతూ ఉన్నా పుస్తకం చూడటం. క్షమించాలి..తెలుగులో..మొదటిసారి. చాలా సంతోషం వేసింది.

మొదటి నుండి, పిల్లలతో పని చేసే సామాజిక కార్య కర్త అయిన నేను, అయ్యో! ఈ పుస్తకంలో పిల్లల గురించి ఏమీ రాయలేదే ఎక్కువగా!! అనుకోని.. అందరిలా అలవాటుగా మర్చిపోయాను.

కాని వందల వేల ఆల్కహాలిక్ కుటుంబాల్ని, వాళ్ళ బాధల్ని, మానసిక గాయాల్ని చూసిన, వాళ్ళ పిల్లల బాధలకు సహానుభూతి మందు పూసిన శ్రీదేవి గారు మర్చిపోలేదు. బుజ్జి అనే పాత్రతో, అందమైన బాలి గారి బొమ్మలతో మన ముందుకు వచ్చి నిల్చున్నారు.

ఒక చిన్న పిల్ల అమాయకంగా వేసే ప్రశ్నలు మనకేంతలే..టకా..టకా.. సమాధానం చెప్పేద్దామనుకుంటే ..మీరు పప్పులో లేదా విరిగిన బాటిల్ మీద కాలు వేసినట్లే. విరిగిన బాటిల్ తోనే బుజ్జి కథ ప్రారంభమవుతుంది. ఇంటి నుండా ఎందుకన్ని బాటిల్స్ ఉన్నాయో తెలియని వయసు. ఎందుకు నాన్న తాగుతున్నాడో అర్ధం చేసుకోలేని మనసుతో మన ముందుకు వస్తుంది…బుజ్జి.

సీసాలాగే నిండుగా ఉన్నప్పుడు, అందరికి కావలసిన మనిషిని.. ఖాళి అయ్యాక సీసా బయట పడేసినట్లే పారేయాలా అని  అడుగుతుంది మనల్ని.

” సీసా తో నాన్న నాకొద్దు బాబు! సీసా లేకపోతే నాన్న నేను జట్టు!” అని నమ్మకంగా చెపుతుంది. మన మనసులు ద్రవించేలా! ఒక దశలో నాన్న తాగుతున్నాడంటే నేనే కారణమా? అని అడుగుతుంది అయోమయంగా..! ఎవరితోనూ చెప్పని చెప్పుకోలేని ఈ జబ్బుకి..ఏ పాపం నేరం తెలియని చిన్న పిల్లలు బలవటం, వాళ్ళ మానసిక పెరుగుదల కి ఇది ఒక అవరోధం కావటం మనం తట్టుకోలేని, జరుగుతున్న నిజం ..చాలా కుటుంబాల్లో!

” బాటిల్స్ బ్రేక్” అని శ్రీమతి. నాన్సీ టేబార్ రాసిన పుస్తకానికి ఈ ” బుజ్జి” ఒక అనుసృజన. ఈ పుస్తకం గురించి రాస్తూ, నాన్సీ టేబార్ అంటారు…మనం మన అసహయతల్లో, కష్టాల్లో మనం ఒంటవాళ్ళం అనుకుంటాం. కానీ..కాదు..అల్కహలిజం అనేది ఇప్పుడు ప్రపంచ సమస్య. కాని..ఈ సమస్యకి పరిష్కారం..ఆ సమస్య గురించి తెలుసుకోవటం, శ్రీదేవి లాంటి వ్యక్తుల దగ్గర దాని యొక్క పూర్తి సమాచారం, తెలుసుకోవటం, సహాయం తీసుకోవటం! ఇంతకంటే బాగా ఎవరు చెప్తారు అనిపించింది చదివితే!

ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇలాంటి పరిస్తితుల్లో ఉన్నా బుజ్జి పాపలు, బాబులు, తాగే తండ్రుల పరిస్థితుల నుండి తమను తాము ఎలా వేరుచేసుకోవాలో, న్యూనత లేకుండా..నలుగురితో ఎలా మెలగాలో చిన్న పిల్లల  భాషలో హృద్యంగా చెప్పటం జరిగింది.

ఈ పుస్తకం ప్రతి వాళ్ళు చదవాల్సిన పుస్తకం. చదివి అందరికి, ముఖ్యంగా, హాస్టల్స్ లో, లైబ్రరీ లలో, ఉంచాల్సిన, చదివించాల్సిన పుస్తకం.

ఇంత మంచి పుస్తకాన్ని ఉచితంగా అందరికి అందిస్తున్న శ్రీదేవి గారు ఎంతైనా అభినందనీయులు. ఒక్క పిల్ల అయినా  ఇది చదివి, తన ప్రాబ్లం ని అర్ధం చేసుకొని, దానిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే, ఈ మద్యం మహమ్మారి వల్ల చితికి పోతున్న ఎన్నో పసి మనసులు, ఈ నీలి నీడల వల్ల కుంటుపడుతున్న వాళ్ళ మానసిక పెరుగుదల, ఆగదనేది అక్షర సత్యం.

 

[సాక్షి ఆదివారం పుస్తకం ఫన్ డే లో స్థలాభావం వల్ల పూర్తిగా ప్రచురింపబడలేకపోయిన “బుజ్జి” పూర్తి వ్యాసం మీ,మా,మనందరి కోసం..పుస్తకం కూడా చదివి ఎలా ఉందొ తప్పక చెప్పండి!!]

Mrs. Shridevi can be contacted @ projectnishedh@gmail.com

The address to their foundation:


V.B.Raju Social Health Foundation,
SRAVANA, 2-2-19/1, F-6,
Durgabai Deshmukh Colony,
Hyderabad-500007

ప్రకటనలు

2 thoughts on “బుజ్జి…ఆల్కహాలిక్ పిల్లల గురించి ఒక చేతన/అవగాహన

 1. Shobha అంటున్నారు:

  బుజ్జి పుస్తకం గురించి మీరు రాసిన రివ్యూ మనసుకు హత్తుకునేలా ఉంది పద్మగారు. పుస్తకం పూర్తిగా చదవలేదు. చదివిన తరువాత మళ్లీ కామెంట్ పెడతాను. ఒక దశలో నా బాల్యం కూడా బుజ్జి బాల్యంలాగే గడిచింది. మా నాన్నగారు రోజంతా కూలిపనులు చేసి చేసి, శారీరక కష్టాన్ని మర్చిపోయేందుకు తాగేవారు. కానీ తరువాత మానుకున్నారు. మా చుట్టుప్రక్కల ఇళ్లల్లో మత్తుకు బానిసలు అయిన తండ్రులు కోకొల్లలు. వారి పిల్లల పరిస్థితిని నేను ఇప్పటికీ కళ్లారా చూస్తున్నాను. ఆ బాధలోంచే నా బ్లాగులో… ఒక కవిత రాశాను. వీలైతే చూడగలరు…

  http://kaarunya.blogspot.com/2012/01/blog-post.html

  ప్రేమతో…
  శోభ

  http://kaarunya.blogspot.com/2012/01/blog-post.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s