నాన్నకి నేనెవరో తెలీదు(ట)…పాపం..!

image-3-picassos-le-enfant-au-pigeon-1901

 

అల్లిబిల్లి మాటలాడుతూ..

అల్లరిగా అందరితో..పోట్లాడుతుంటే..

మీ అమ్మ మురిసి ముక్కలయ్యేదంట…

అంటూ అంతా..చెప్తుంటే..

మరి ” నాన్నో?..” అంటూ

అడిగిన జ్ఞాపకం…

 

అందరూ..ఆపసోపాలు పడుతుంటే..

అలవోకగా చదువుల మెట్లెక్కితే..

” నా తల్లి.. సరస్వతి..: అన్నాదమ్మ..

మరి నాన్నేమన్నారే..అన్న నా స్వరం..

మెటికల శబ్దంలోనే మాయమైంది..

 

చక చక ఉద్యోగాల వ్యవహారాల్లో..

జ్ఞానాల యజ్ఞాలలో…అహో ఓహో లు వింటుంటే..

ఆకర్నాంతాల ఆవల వరకు ఆతురత పడుతున్నా..

నాన్న విన్నారో లేదో నని…

నా మేధస్సు..ఆయనకు కాదా మురిపెం???

 

విన్నా..అనుకున్నా…అంతా అయింది..

నా సంబడం…!

” ఓహో.. మీరు ఫలానా వాళ్ళ అమ్మాయా??”

మీరున్నారని మాకు తెలీదే??

అమాయకంగా అడిగిన ప్రశ్నకు..

మళ్ళీ మొదటికొచ్చింది నా అస్తిత్వం..

అందలాలు అందుకుంటే…

అభినందిస్తారనుకున్నా..

అమ్మయికో మేధ ఉందని..

నేనో “మనిషి” నున్నానని..

నాన్నకింకా తెలీదమ్మా..పాపం..!

 

–సాయి పద్మ

ప్రకటనలు

One thought on “నాన్నకి నేనెవరో తెలీదు(ట)…పాపం..!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s