బ్లాగ్’వనంలో విరబూసిన జాజి పరిమళాలు- జాజి మల్లి కథలు

blag vanamlo

నోస్టాల్జియా అనబడే గత మధుర స్మృతులు అందరికీ ఉంటాయి..మంచి వాతావరణం..స్నేహం..కనిపించగానే రింగులు రింగులు గా గతంలోకి జారుకునేవారి సంఖ్యే ఎక్కువ. కొందరు దాన్ని..” కాలం మారిపోయింది..!” అంటూ నిట్టూర్పుతో ఊడ్చేస్తేమరి కొందరు జ్ఞాపకాల రంగులకి..నిఖార్సయిన బాల్యపు అమాయకపు మెరుగులద్దిఉత్సాహంగా వర్తమానం లో జీవించేందుకు ఆరోగ్యపు చిన్ని చిన్ని మాత్రలవుతారు..! అందమైన గతానికీ, ప్రస్తుత అయోమయానికీ మధ్య ఒక వారధి కట్టిన కథలేవైనా మనల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి. సరిగా అక్కడే విజయం సాధించారు..మల్లీశ్వరి గారు.. తనజాజి మల్లిబ్లాగ్ కథల్లో. ఈ మధ్యనపెరస్పెక్టివ్ప్రచురణల ద్వారా ప్రచురితమైన చిన్ని చిన్ని బ్లాగ్ కథలు మనల్ని హడావిడి పెట్టవు, నిశ్శబ్దంగా మన హృదయాల్ని కొల్లగోదతాయి అంతే..అదే చెప్తారు ఆమె తన కథల్లో. గెల్చుకోవాల్సిన హృదయాలు అంటూ..! ఇదే మొదటి కథ కూడానూ..

జాజి మల్లి అనే తన బ్లాగ్ ద్వారా అంతర్జాలంలో పరచబడిన, పొట్టి పొట్టి కథల్లో మనం చాలా గ్రహిస్తాం..” ఇవాళ బ్రతకటానికి ఇవాళే తినాలి కదమ్మా..!” అని పడుపు వృత్తి తప్పని దళిత మహిళ ధైర్యం దగ్గర్నుంచీ..” విజయం అనేది గమ్యంలో కాదు..ఒక్కో మెట్టూ కట్టుకొని ఎక్కే మాలో ఉందని ..చెప్పే గిరిజన అమ్మాయి స్థైర్యం దాకా.. ప్రతీ కథకూ ఒక వాక్యంలో చిన్న కొస మెరుపుండటం చదువరికి ఉత్సాహం కలిగించే విషయం. పేజీలకు పేజీలు జనాలు వాపోయే ప్రపంచీకరణం, పరాయీకారణం..లాంటి విషయాలను ఒక్క వాక్యంతో మనసులోకి కుదిస్తారు.. కథల్లో. ఉదాహరణకి..” బియ్యే లు చదివినా బియ్యంలో రాళ్లేరక తప్పుతుందా అనే బామ్మగారూ.. క్లాసు రూం లో కట్టి పడేసినంత మాత్రాన ..మేఘాలు కురవక మానవుఅనే కుర్రాడూ..” బానిసలకే బానిసను నేను..నా అస్తిత్వం కోసం ఎన్ని పెచీలకైన సిద్ధం అనే మొండి చంద్రమౌళీ.. నిక్కచ్చిగా మనకి పాఠాలు చెప్తారు.

బ్లాగ్ కథలను చదువుతుంటే నాకు చెఖోవ్ కథలు గుర్తొచ్చాయి. ఒక ఫ్లాష్ లాంటి కొసమెరుపు, చమక్కు ఉండటం వీటి ప్రత్యేకత. బహుశ రచయిత్రి బ్లాగ్ ప్రపంచంలో అనుభవించిన స్వేచ్చ, మంచి భావ వ్యక్తీకరణ అయిందని నాకు అనిపించింది. ఆంక్షలు లేకుండా , ఆవిడ అనుభవించిన బాల్యం, సహజంగా ప్రతిబింబించింది. షుమారు డెభ్భై దశకం నుంచి తొంభై దశకం దాకా చాలా మంది అనుభవించిన బాల్యం, వాటి పోకడలూ, సరదాలూ అల్లర్లూ, మధ్య తరగతి కుటుంబాల ముచ్చట్లు చెప్పిన కథల్లో, తరానికీ , తరానికీ ఉన్నా అయోమయలూ, వేదనలూ, ప్రేమలూ కూడా కొన్ని కథల్లో ఇంకా కొంచం చెప్పి ఉంటె బాగుండేదానిపించింది నాకు. ఎందుకంటె ఒక అస్తిత్వపు పోరాటం లో ఆందోళన, అయోమయం కూడా చాలా ముక్యమైన అంశం.అది కూడా ఇంకా కథల విలువనీ, నాణ్యతనీ పెంచుతాయని నాకనిపించింది.

చివరగా రచయిత్రి తను బ్లాగ్ కథలు ఎందుకు రాసారో చెప్పారు.. ఒక సమీక్షకురాలిగాబ్లాగ్ కథలు ఎందుకు చదవాలో చెప్పాలని నాకు అనుపించింది.. కొంచం శ్రద్ధ పెట్టి వినండి.. సారీ..చదవండి. మనందరి ఉరుకుల పరుగుల జీవితాల్లో, పెద్ద పెద్ద కథలు చదవటం కష్టం అయిపోతోంది.. బరువైన పుస్తకాల వైపు ఆశగా చూస్తూ..పుస్తకం సైజు చూసి చదవలేకపోతున్నాం అనేవాళ్ళకి.. గడిచిపోతున్న జీవితాన్ని, మోడువారిపోతున్న ఆశల తోటలకీ , తామే తోటమాలులు ఎలా కావాలో సూటిగా, సరళంగా చెప్తుందీ పుస్తకం. మానసికంగా పడిపోతున్న మన విలువల్ని మనమే ఎలా నిలబెట్టుకోవాలో చెప్పిన చిట్టి కథలంటే..ఒక కథలో పాత్రా లచ్చమ్మలా నాకూ కుసింత బెమత వచ్చేసినాదిచబాస్ ..మల్లమ్మా.. బలే సొగసుగా రాసావ్ కతల్ని.. చబాస్!!

ఆదివారం ఆంధ్ర భూమి ” అక్షర” శీర్షికలో వచ్చిన ఈ రివ్యూ చదవాలనుకుంటే పెర్మనెంట్ లింక్ ఇదిగో-  http://andhrabhoomi.net/content/blag-vanamlo-viraboosina-jaji-parimanaalu

–సాయి పద్మ మూర్తి

ప్రకటనలు

One thought on “బ్లాగ్’వనంలో విరబూసిన జాజి పరిమళాలు- జాజి మల్లి కథలు

  1. Shri అంటున్నారు:

    చక్కటి సమీక్ష…స్పందన లా ఉన్నది కానీ
    అవాస్తవికంగా లేదు..మనసున్న వారు తప్పక
    చదవవలసిన కథలు..రచయిత్రికి అభినందనలు!

    శ్రీదేవి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s