(నిజం నుండి) పారిపోతున్న తల్లులందరికీ పెదతాండా…దండం..!

Mother_with_kids

 

ఎవరి పుట్టిన రోజన్నా కూడా, నేను, మా వారు కూడా వాళ్ళ తల్లికి కూడా తప్పకుండా పుట్టిన రోజు విషెస్ చెప్తాం. ఎందుకంటె..క్షేత్రం, బీజం లాంటి ఎన్ని చర్చలు జరుగుతున్నా, నవమాసాలు మోసి, ప్రాణాంతకం అని తెలిసినా , కనీ, వాళ్ళ కోసం ఎన్నో చేసే తల్లి అంటే.. ఎలాంటి వాళ్ళకన్నా సెంటిమెంట్ కదలాల్సిందే..కానీ.. తోటకూర నాడే చెప్పనైతివి అన్నట్లు..కొందరు తల్లుల విషయాలు, వివరాలూ తెలుసుకుంటే, ఆధునిక తల్లుల నాగరికత ఒక్కోసారి అశనిపాతంలా.. వాళ్ళ కొనుక్కున్న సాంప్రదాయం ఆందోళన కరంగా అనిపిస్తోంది.. పొద్దున్నే స్నేహితులు పంపుతున్న తల్లుల, తండ్రుల గొప్పతనాల SMS లు కూడా వొళ్ళు మండించేటప్పుడు రాసిన వ్యాసమిది….ఏదో సినిమాలో అన్నట్లు.. తప్పులుంటే క్షమించండి…మాకు అర్ధం కాలేదనుకుంటే…వదిలేయండి.. లేదూ..ఇలాంటి వాళ్ళుండరు అనుకుంటే…నటించటం మొదలెట్టేయండి..!

ఇక్కడిదాకా రాసి ఆగిపోగానే..ఒక సన్నిహితురాలు అన్నారు.. ఎందుకు తల్లుల గురించే రాస్తున్నావు అని..? ఏమో.. తరాలు మారినా, చదువులు, పదవులు ఎక్కువైనా..పిల్లల పెంపకం అనగానే..అది తల్లి బాధ్యత అన్నది ఇంకా మారినట్టుగా అనిపించటం లేదు.. ఎక్కడో ఒకచోట డైపర్స్ మారుస్తున్న తండ్రులని అడ్వర్టైజ్మెంట్లలో చూపిస్తున్నా..ఇంకా మొత్తం పెంపకంలో కొన్ని ముఖ్యమైన దశల్లో తల్లి పాత్ర అనండి, అధికారం అనండి.. ఇంకా మారలేదు.. అనిపిస్తోంది..

 • చాలా ఖరీదైన పొట్టి పొట్టి, వొంటి కంటుకుపోయే బట్టల్లో వచ్చిన కూతుర్ని ప్రశంశగా చూస్తోందో తల్లి…పదమూడేళ్ళ ఆ కూతురు…ఇబ్బందిని తల్లి మేచ్చుకోలులో దాచుకుంది. కొంచం అసభ్యంగా లేదూ..?  అని నసిగిన హితుల గొంతు.. “ఈ వయసులో కాకుండా ఎప్పుడేసుకుంటారు ఇలాంటి మోడరన్ బట్టలు? అయినా చిన్న పిల్లలకు సభ్యాసభ్యాలు ఏమిటి..?’ అంటూ ఇచ్చిన గట్టి పాఠం మాత్రమే మిగిలింది.
 • పదిహేనేళ్ళ మీ అబ్బాయి మొబైల్ వాడకం కొంచం గమనించండి.. అలాగే తన ఫ్రెండ్స్ ని కూడా, వాళ్ళు తన ఫ్రెండ్స్, మిగతా వాళ్ళతో చేరి అసభ్యమైన మెసేజెస్ పంపుతున్నారు..అన్న కంప్లయింట్ కి.. ఒక తల్లి సమాధానం..” ఒక సారి చూసి తిట్టానండీ..! అయినా ఈ వయసులో ఇవన్నీ సహజమేగా!!
 • అలాంటి తల్లుల ఇంకొకరు..” మీ అబ్బాయి తాగుడు అలవాటు మూలంగా చాల ఇబ్బందులు పడుతోందండీ మీ కోడలు..మీరన్నా కాస్త కల్పించుకుంటే బాగుంటుంది..!” అన్న సన్నిహితుల సలహాకి..” కష్టమండీ.. మొదట్లో తక్కువే తాగేవాడు…అయినా భార్య చూసుకోవాలండీ..ఈ అలవాట్లు అవీ..! బాగా స్వతంత్రత ఎక్కువ ఆ పిల్లకి, ప్రతీ దానికీ వితండ వాదమే!!” అని ఎటో చూస్తూ సమాధానం..
 • ఎంత బాగా నెట్ లో అన్నీ చూస్తుందో..? బాగా చదువుకుంటోంది అనుకున్నాను..! ” ఈ విషయం ఎక్కడ చెప్పారు కదూ.. అంటూ.. టీన్ఏజ్ లో అవాంచిత గర్భం డ్రైవర్ ద్వారా వస్తే, డాక్టర్ వైపు ఆరాగా చూస్తున్న ఒక తల్లి వైనం..
 • మావారు మంచివారే.. కానీ తాగినప్పుడు కొంచం కంట్రోల్ ఉండదు.. మా విషయాలు ఎక్కడా చెప్పద్దని చెప్పానులెండి.. అంటోంది ఒక తల్లి…నిరాసక్తంగా మారుతూ గాజు కళ్ళతో తిరుగుతున్న కూతుర్ని.. ఇంటికే సరిగ్గా రాని కొడుకునీ తలచుకుంటూ..
 • ఇవికాక తప్పని సరిగా పిజ్జాలు మాత్రమే తినే పిల్లలూ…వారాంతం అంటే పెంపకానికి కూడా సెలవిచ్చె తల్లి తండ్రులూ..

Mother-Kids-crying

ఆలోచిస్తే అనిపిస్తుంది.. మన అభివృద్ది లో మనం ఒక వస్తువుకి, మనిషికి, పరిణామ దశలో పెరుగుతున్న మొక్కకి ఇచ్చినంత ప్రాముఖ్యం కూడా పిల్లలకి ఇవ్వటం లేదని.. ఇంక అడవి మొక్కలు నయం కదూ.. స్వేచ్చగా నన్నా పెరుగుతాయి.. ఏ కార్పోరేట్ కాలేజీల్లోనూ వాళ్ళ బాల్యాన్ని పోగొట్టుకోకుండా..

అందరూ నటించేస్తే నిజం మాట్లాడేది ఎవరని?? నిజాలు కేవలం సోషల్ నెట్వర్కింగ్ సైట్లకు మాత్రమే పరిమితం కాకుండా చూడాల్సిన బాధ్యత మీది, మాది, మనందరిదీ కాదా??

 

(బాలల హుక్కుల పాలసీ సమావేశాల సందర్భంగా)

–సాయి పద్మ మూర్తి

ప్రకటనలు

4 thoughts on “(నిజం నుండి) పారిపోతున్న తల్లులందరికీ పెదతాండా…దండం..!

 1. Jayasree Naidu అంటున్నారు:

  మోడరన్ ఎలెక్ట్రానిక్ గడ్గెట్లు తరాలని ఎటు తీసుకేళ్తున్నాయో అర్థం కావడం లేదు
  కాలేజీ లో ఎన్నో కథలు.. ఎన్నో వాస్తవాలు
  ఆధునికతకు అన్ని వేపులా పదునే…
  కలల రక్తం ఒడ్చుతున్న యంగ్ జనరేషన్
  ఫాషన్ పాషన్ లో దారి ఎటో గమ్యం ఏదో చేరే తీరు ఏదో…
  ఎవరిని మండలించాలి..
  వాళ్ళ ఫాషన్లని ప్రోత్సహించే తల్లితండ్రులనా
  హెచ్చరించే హితులని లెక్క జేయని పోకడలనా

 2. Shiva Prasad Raju Samanuru అంటున్నారు:

  Chaala bavundi madam…nijangane eekaalam thallithandrulaku undalsina &theesukovalsina bhadyatha..undatam ledu.Alaagani parents ne analemu…andari gundello unde matalu meeru adbhuthangaa chepparu..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s