ప్రేమకు’ దినం….

cupid

ప్రేమికుల దినానికీ..

ప్రేమ దినానికీ…

హస్తిమశకాంతం తేడా ఉందనిపిస్తుంది నాకు

ఒక్కొక్క అనుభూతి కీ ఒక దినం కేటాయించటం..

గడచిపోతున్న కాలాన్నీ..

ఇసుక రేణువుల్లా చేజారిపోతున్న

బంధాల్నీ వడిసి పట్టాలనుకోవటం…

వాలుగ వెల్లువలా త్రుళ్ళి పడే చేప పిల్లని…

బుద్ధిగా మఠం వేసుకొని కూర్చో…అని

ఆజ్ఞాపించినట్టు వుంటుంది నాకు…

కానీ..

ఒక దినమన్నా ప్రేమకో రోజుందని అనుకోకపోతే..

గుర్తు రాని పరుగు పందేలూ..

వందల్లో వేలల్లో ఎక్కడో కనిపించే అరుదైన మానవ

సంబంధాలూ..

అంతరించిపోతున్న జీవ జాలంలా..

సుషుప్తిలో గుర్తొచ్చే అవగాహన లేని ఆవహనలూ..

తలచుకొని..

తాటి ముల్లులా బాధిస్తుంది..

అకారణంగా దిగులేస్తుంది…

అయినా… ప్రేమకి కట్టడాలు కట్టే మన దేశంలో..

ప్రేమని శాశ్వతంగా సమాధి చేయకపోతే ఎలా..??

సమాధి లో సమిధ అవని ప్రేమ…

బయటికొస్తే సమాజానికి నష్టం కాదూ??

ఏంటో.. అజ్ఞానిని నేను..

తాజ్ మహల్ ని చూసి మురుస్తాం గానీ…

మన ప్రేమలపై ముసురుకున్న దుమ్ము ధూళీ

దులిపే తీరిక మనకెక్కడిది..!!

–సాయి పద్మ

Steve-McCurry-Taj-Mahal-and-Train

[ వాలంటైన్స్ డే సందర్భంగా..!!]

ప్రకటనలు

3 thoughts on “ప్రేమకు’ దినం….

 1. i j swamy అంటున్నారు:

  కందము
  ప్రేమకుయొక్కదినంబా
  ప్రేమించుటప్రణయతృష్ణప్రేరణకొఱకై
  అమరత్వముగలప్రేమకు
  కమలాక్షీకాలమంతకామునిదినమే

 2. i j swamy అంటున్నారు:

  తల్లీ సాయిపద్మా నీ తెలుగు రచన చాలా బాగుంది. ప్రేమ దైవలక్షణం. ఎవరు ఎవరినిప్రేమించినా అది దైవత్వమే.తల్లి బిడ్డనూ భర్త భార్యను సోదర సోదరీ ప్రేమలన్నీ ఒకేరకమైన అనుభూతులు. ప్రజలందఱినీ ప్రేమించడం, దేశాన్ని ప్రేమించడం నిస్వార్ధమైనవి. .

 3. Jayasree Naidu అంటున్నారు:

  **తాజ్ మహల్ ని చూసి మురుస్తాం గానీ…

  మన ప్రేమలపై ముసురుకున్న దుమ్ము ధూళీ

  దులిపే తీరిక మనకెక్కడిది..!!**

  ముచ్చట గా మూడు వరసల్లో ఆధునిక యాంత్రిక జీవితం.. కోల్పోతున్న ఆప్యాయతలు.. నొప్పింపక తానొవ్వక అన్నట్టు

  చెప్పారు పద్మ.. బ్యూటిఫుల్ లైన్స్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s