తాగితే కవిత్వం వస్తుందా….??

a-1

తాగితే కవిత్వం వస్తుందా..??

వస్తుందేమో అనుకున్నా చాన్నాళ్ళు..

విస్కీ కార్పెట్సిగిరెట్ సోఫా..

అయోమయం చూపులు

ఆడదాని అంగాంగ వర్ణనలూ..

ప్రాధమిక కవితా వస్తువులా??

ఏమో.. అవునేమో..

రవికాంచని కవి మస్తిష్కం..

ధరణీ చేలాంచలాలు దాటిన ప్రయోగ శీలతా..

తలుక్కున మెరిసి.. తలరాతలు మార్చే

లోచనాల ఆలోచనలూ..

మలిన మేధో మండలాలూ..

ఆమలినమనుకుని భ్రమించే హృదయాలూ..

తనని తను వెదజల్లు కునే వ్యక్తిత్వాలూ

వ్యర్ధ విలాపాలూ

తప్పనిసరి పాపం.. అని తలచుకున్నా..

చర్విత చర్వణంలా జాలి పడ్డా..!!

అంతలోకిక్కిరిసిన అపార్ట్మెంట్ల బ్రతుకుల్లో

కుక్కిపెట్టినట్టున్న చేపల బజారు

సంభాషణ కళ్ళకు కట్టేలా కనిపించింది..

పిత్త పరిగెలా పరిగెడతావెంటే పిల్లాఅన్న వరసైన మేలానికి

మరే..మంటిబుక్కడం లాంటి మావ దొరికాడని.. కిసుక్కుమందో గడసరి..!”

చేపల వాసన, చెమట చుక్కల్లో..కవిత్వం కనిపించింది..

తెలుగు చావలేదని తెలిసొచ్చింది..

3241324468_909df1a8d3_z

ఇంతలో..తప్పనిసరి పొట్టి బట్టల

బిగుతు అసౌకర్యాల అసహాయత

అనుభవిస్తూనే.. చెప్తోందో పిల్ల

ఆరేళ్ళు నిండవేమో

నమ్మకంగా చెప్పిందీ..

తన పెళ్ళికి ఆకాశాన్ని కూడా పిలుస్తానని..

మంచి భోజనం పెడతానని..

హమ్మయ్యకవిత్వం చావలేదింకా

aa-bottle 

నిట్టూర్పుతో గుర్తోచ్చిందొక సత్యం..

ద్రావకాల్లో ములిగితేలేది..

వెతుక్కునేది బ్రతుకు మీద ఆశనని

మనసున కవిత్వం నిండాలంటే.. నిషా నిద్రలక్కరలేదని..

 

సాయి పద్మ మూర్తి

ప్రకటనలు

7 thoughts on “తాగితే కవిత్వం వస్తుందా….??

 1. SRRao అంటున్నారు:

  కవిత్వానికి స్పందించే మనసు కావాలి గానీ నిషా కాదు. పలాయన వాదంలోనుంచి పుట్టిన వాదం అది. బావుంది పద్మ గారూ ! అట్టడుగు అనుకుంటున్న మనుష్యుల సంభాషణాల్లోనూ, చిన్న పిల్లల మాటల్లోనూ కవిత్వాన్ని దర్శించిన మీకు అభినందనలు.

 2. వాసుదేవ్ అంటున్నారు:

  అయ్యో ఇంకా మందు గురించి నా అభిప్రాయం అడిగారనుకుని ఇక్కడికి ఆవేశంగా వచ్చాను….చెప్తామని…చూస్తే ఇంకేముందు…సారీ మాట తడబడుతోంది…ఇంకేముంది? అంతా మీరే చెప్పేసి..హ్మ్మ్ చాలా బావుంది పద్మా జీ. నిజానికి మీ కవితల్లో ఈ మధ్యకాలంలొ వొచ్చినవాటిల్లో ఇది బెస్ట్ అని నా అభిప్రాయం. అవును కవిత్వం చావదు, భాష ఉన్నంతకాలం కవిత్వం చావదు.కాలరిడ్జ్ లాగా ఇన్‌‌టాక్స్‌‌కేటేడ్ స్థితిలో ఏదో రాయటం ఆ తర్వాత అది కవిత్వం కావటం ఓ క్యాటగిరీ అనిమాత్రమే అనుకుంటా….అలా రాసేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. కాని నాలుగు మంచి మాటలు మంచిగా చెప్పటానికి వేరే ఏజంట్ అవసరం అని అనుకోను. బట్ చాలా బావుంది ఈ రచన.

  • తమ్మి మొగ్గలు అంటున్నారు:

   తాగుడికీ కవిత్వానికీ ముడి పెట్టి యెందుకు రాసానూ అంటె సరిగ్గా చెప్పలెను గానీ…అన్ని రంగాలలొ ఈ సోషల్ ద్రింకింగ్ అన్నది చిన్నగా మొదలై మెదళ్ళను తినేస్తుంటె బాధెసిందండీ!!సాహితీ లోకంలో నిజాయితీ తగ్గడానికి ఇది కూడా ఒక కారణం ఏమో అనిపించింది..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s