రక్తం వోడుతున్న సాక్ష్యాలు..యెర్ర మట్టి దిబ్బలు..??

DSC_0433

ఏం కావాలి మనకింకా?

ఒకప్పటి చరిత్ర… ఇప్పుడు కేవలం ఒక శిలా ఫలకం..

రక్త వర్ణ శోభిత యెర్ర మట్టి దిబ్బలు..

సిమెంట్ దిబ్బలుగా మార్చేస్తున్న వైనం..

సంతోషమే కదా మనందరికీ..

ఇంక అంతా సిమెంట్ దిబ్బల డబ్బులే..

DSC_0439

 

ధరణి పొరల ఆనందాల సాక్ష్యాలు..

సముద్రుని అభిషేకానికి చిహ్నాలు..

పర్యావరణ ప్రయోగశీలతకు ఆనవాలు..

తరాల విజ్ఞానానికి మార్గదర్శకాలు..

మన ధన’హుంకారానికి నేడు మట్టి పాలు…

పట్టపగలే వస్త్రాపహరణం జరుగుతున్నా

ద్రౌపది కున్న నిబ్బరంలో అణుమాత్రం లేదీనాడు..

వరసగా వలిచేస్తున్న సహజాత సంపదను..

రక్షించేందుకు ఏ కృష్ణుడూ రాడు!!!

girls-sand-dunes-vietnam_21943_600x450    dubai-desert-safari

 

అయినా మనకేం..?

వారసత్వానికి నిలువెత్తు నమూనాను..

ఇట్టే అణగ తోక్కుదాం..

మన నెత్తుటి అడుగుజాడల్లో

మన పిల్లల ప్రశ్నలకు జవాబీయలేక తలదించుకుందాం…

సంతోషమే కదా మనందరికీ..

ఇంక అంతా సిమెంట్ దిబ్బల డబ్బులే..

–సాయి పద్మ మూర్తి

In Visakhapatnam, due to rapid expansion of the city, the red sand dunes paved the way for concrete structures and multi-storeyed buildings between the Naval Coastal battery and Peda Waltair. Yendada and adjoining villages on the outskirts of the city also had abundant red sandhills. But the red hills were gradually flattened in the course of various constructions that came up along the beach…. Its my wail for a treasure we are losing ever and forever!!]

Photography © Pragnanand

The photograph may not be manipulated in any way and may not be used in commercial or political materials, advertisements, emails, products, promotions or anywhere or in any form without the prior approval of the PHOTOGRAPHER.

© Sai Padma:// IPR All Rights Reserved.

ప్రకటనలు

3 thoughts on “రక్తం వోడుతున్న సాక్ష్యాలు..యెర్ర మట్టి దిబ్బలు..??

 1. Jayasree Naidu అంటున్నారు:

  Nature is there even before man
  man is a part of nature.. not its dictator..
  The more we forget this truth Hence is the calamities destroying us..
  Its a common man’s hapless status and the power mongers’ greediness
  Driving us towards senseless destruction
  The post is really really disturbing Padma…

 2. వాసుదేవ్ అంటున్నారు:

  మీ ఆవేదన ఆర్ద్రంగా……కళ్ళుచెమ్మగిల్లేలా….అక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిగా నాకూ భాగముంది ఈ బాధలో…నిస్సహాయతకి తలవొగ్గి మళ్ళి మరోసారి ఈ వ్యాక్యాలు చదువుకోవటమే…..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s