శివ’తత్వ బైరాగి…

Bairagi1

 

శివ తత్వాన్ని, శివాన్ని అర్ధం చేసుకోవాలంటే..

ఒక రాత్రి చాలదు..

ఒక జన్మ కూడా చాలదు..

సరే మరి జన్మ తత్వాన్ని నమ్మిన వాళ్ళకే అనుకోండి..


గిరిజన దేవుడు..సహ చర జీవుడు..

ఆద్యంత రహితుడు..పరమ శివుడు..

ఇవాల్టి జనం..సమయం లేని తరం

తన మనసులో కూడా తనకి తప్ప

దేనికీ చోటివ్వని ..గందరగోళంలో..

అలవోకగా అర్ధభాగాన్ని అర్ధాంగికి ఇచ్చిన..

ప్రేమ స్థిత కారుడు..

తన దుఖాన్ని దాక్షి’న్యంగా దహియించిన  లయకారుడు..వైరుధ్యం అతని లయం.. సమత అతని బలం..

నిస్సంగత్వ ..బైరాగత్వం..అతని అభిమతం..

ఇది కూడా నేర్చుకోలేకపోతున్నామా..మనం?

ఒక భోగ శంకరంలోని.. శాంకరిని లయించలేకపోతున్నాం..

ఒక భోళా శంకరుడి లోని..నిజాయితీ చూడలేకపోతున్నాం..

 

విరాగి.. కాదు బైరాగి అంటే..

విపరీతం కాని వైరుధ్యాల సమాహారం బైరాగాత్వం..!

సృష్టి స్థితులను మమేకం చేయాలంటే..

గరళ పరిస్థితులను…గరళం అని తెలిసీ ..

గాత్రం దాటక బంధించాలంటే..

సమైక్య జీవనం సాధించాలంటే..

ప్రతీ వారు ..నేర్వాలి శివ తత్వం కూడిన బైరగాత్వం !!!

–సాయి పద్మ మూర్తి

[ The Photograph of Painting with this poem is hand sketch of Sri.Pragnanand, all rights regarding reproduction anywhere else is either in photo form or painting form rests with him]

© Sai Padma :// IPR All Rights Reserved

ప్రకటనలు

4 thoughts on “శివ’తత్వ బైరాగి…

 1. Jayasree Naidu అంటున్నారు:

  **వైరుధ్యం అతని లయం.. సమత అతని బలం..

  నిస్సంగత్వ ..బైరాగత్వం..అతని అభిమతం..**
  liked these lines very much

  ఈ మధ్య కాలం లో కొద్దో గొప్పో మార్పు కనిపిస్తోంది పద్మ…
  ముఖ్యం గా యంగ్ జెనరేషన్ లో లైఫ్ గురించి డీప్ గా ఆలోచించే వాళ్ళూ వున్నారు.. వీళ్ళ ని చూసి కొంత ఆశ మంచి మీద
  వ్రుద్ధ్హాప్యం వచ్చినా వస్తు మొహం వదలని వారూ వున్నారు. నాణానికి రెండు పార్స్వల్ల్లా …
  మాయా మోహం బూది చేసి అలదుకొన్న బైరాగాత్వాన్ని వెతకడానికి ముందు (మన త్రిగుణాలు )త్రిపురాసుర సంహారం – శక్తి సాక్షాత్కారం- ఆ తర్వాతే నిర్మోహత్వం. ఇన్ని దాటాలి కదా ! wherez the time…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s