దేహం…

great-mother-mandala

అవనతంగా..విసిరేసినట్టున్నా..

వేణువులా లో వాడిన వెదురులా..

నీ మాటల శకలాలలో..నువ్వు చేసే రంద్రాన్వేషణలో

వొళ్ళంతా చిద్రమవుతున్నా..

నా మనఃపంజరమైన ఈ దేహమంటే

నాకెంతో ఇష్టం…

వాంఛల వలయాలలో..సుడితిరుగుతున్నా

వేదన..మగత లాంటి ఒక మృగ తృష్ణ గా మారినా..

నా మనస్సుని..అర్పణని..నా ప్రాణాన్ని

చివరాఖరికి..నా వైయుక్తిక వైరాగ్యాన్ని

కూడా నీకు తెలిపేది ఈ దేహమే కదా..!

భగవంతుడిచ్చిన దేహాన్ని ప్రేమిస్తున్నాం అంటారంతా..

ఈ దేహంలో నువ్వుంటే..మళ్ళా నువ్వివ్వటం ఏమిటి..

నీతో ఈ నవ్వులాట ఏమిటి..?

అందుకే అంటున్నా..

కుబ్జగా నైనా సరే..కన్నయ్యను చేరేది..

నా దేహ వికలత…మనః సంకల్పం మాత్రమేనని..

దేహం దేవళం మాత్రమే కాదు…

ప్రబల దుర్బలత్వానికి సూచిక అసలే కాదు..

అద్వితీయ దైహికత్వానికి దగ్గర దారి అని…!!

–సాయి పద్మ

ప్రకటనలు

2 thoughts on “దేహం…

  1. loknath అంటున్నారు:

    దేహం దేవళం మాత్రమే కాదు…
    ప్రబల దుర్బలత్వానికి సూచిక అసలే కాదు..
    అద్వితీయ దైహికత్వానికి దగ్గర దారి అని…!!
    అంటే..దేహాన్ని( శరీరాని) గురించేనా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s