నేను విమాన ప్రయాణం చెయ్యడానికి అనర్హురాలినైతే, అతను విమాన పైలట్ గా అనర్హుడు…

25story1

 

శారీరిక అవకరం ఉన్న వారికి విమాన ప్రయాణం చాలా మార్లు అంత ఆనంద దాయకమైన అనుభూతి కాదు. ఒక పురుషుడు కానీ, స్త్రీ గాని తనకు తానుగా ప్రయానించాలంటే చాలా ఇబ్బందికరమైన సంఘటనలు ఎదుర్కోవడం షరా మామూలే. అలాంటి వేదన కలిగించిన ఒక సంఘటన ఇప్పుడు మీకు చెప్తున్నాను.


విమానం దించేసారు..

ముంబై కి చెందిన ADPAT ఎం.జి.ఓ. వారు గోవా లో చేస్తున్న ఒక కాన్ఫరెన్సు కి నేను వెళ్ళాల్సి ఉంది. నేను స్పైసు జెట్ విమానం SG 308 కొల్కొత నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విమానాశ్రయం నుండి బయల్దేరే విమానం లో వెళ్ళాలి. ఫిబ్రవరి 19, 2012  ఉదయం 7.05 కే నేను విమానాశ్రయం చేరుకున్నాను. మామూలుగా జరిగే తనిఖీల తర్వాత విమానం వరకు ఒకరి సహాయం తో వెళ్లి లో కూర్చున్నాను. కొద్ది సేపటికి నా చుట్టూ ఏదో జరుగుతోందని గ్రహించాను. ఒక ఫ్లైట్ అసిస్టెంట్ వచ్చి నా బోర్డింగ్ పాస్ ఇవ్వమని అడిగాడు. అప్పుడు నేను నా సీట్ వదిలి వారితో వెళ్ళాల్సి వచ్చింది. నన్ను విమానం దించేసి, ఒక కార్ ఎక్కించి విమానాశ్రయ టెర్మినల్ ఆఫీసు దగ్గరికి తీసుకెళ్ళారు.
అప్పటికే నేను చాలా ఉన్మాది లా ఐపోయాను. నన్ను విమానం దించేయడానికి గల కారణం కూడా ఒక్కరూ నాకు చెప్పలేదు. అప్పుడు నన్ను ఎయిర్లైన్స్ ఆఫీసుకు తీసుకెళ్ళారు. నేను వాదించగా వాదించగా తెలిసిన విషయమేంటంటే ఉత్ప్రభ్ తివారి అనే  విమాన కెప్టెన్ నన్ను వికలాంగురాలిని కనుక తీసుకెళ్ల నిరాకరించాడని. అసిస్టెంట్ మేనేజర్ వాళ్ళూ నా పట్ల సహానుభూతి చూపించినా , వారి చేతుల్లో ఏమీ లేదని , నిస్సహాయులమని కెప్టెన్ కి బోధపరచ లేక పోయామని బాధ పడ్డారు. నన్ను వేరే విమానమన్నా ఎక్కించండి లేదా నా డబ్బు వాపసు ఇవ్వండని నేను గొడవ పెట్టాను. అసిస్టెంట్ మేనేజర్ విష్ణు రామేసన్ తను మరునాడు ఫ్లైట్ కి తీసుకేల్తానన్నాడు, అంటే ఫిబ్రవరి 20 ని అన్నమాట—-ఇటువంటి పరిస్థితే రేపు మళ్ళీ ఏర్పడదని ఏమిటి నమ్మకం?? అని నేను అతన్ని ప్రశ్నించాను. నన్ను విమానం లోంచి దించేసినందుకు కారణం చెప్తూ రాసిన పత్రాన్ని ఇవ్వమని అడిగాను , కానీ వాళ్ళు కారణాంతరాల వల్ల రాసి ఇవ్వడానికి ఒపుకోలేదు. అయితే నేను రాసిచ్చిన కంప్లైంట్ మాత్రం తీసుకున్నారు. నను ఇంటి దగ్గర దించేసి మరునాడు పిక్ అప్ చేసుకుని విమానాశ్రయానికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కానీ నేనా మరునాడు అసలు ప్రయాణం చేసే స్థితిలో లేను. ఆ ముందు రోజు జరిగిన సంఘటనల వల్ల బాగా కలత బడి పోయాను , డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్తితి వచ్చింది.

DGCA రూల్స్

ఇక్కడ మనకి స్పష్టంగా అర్ధమయ్యే విషయం ఏమిటంటే,  అక్కడి ఎయిర్ లైన్స్ అధికారులకి రూల్స్ పట్ల సరి అయిన అవగాహనా లేదని!!డైరెక్టరేట్ (DGCA)  జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ , సివిల్ అవిఏషన్ (Civil Aviation Requirements) లో సవివరంగా సెక్షన్ 4.1 డాక్యుమెంట్ ని అనుసరించి అంగవైకల్యం ఉన్న వారిని /లేదా శారీరికంగా కదలలేని వారిని 2008 మే లో జారీ చేయబడిన దాని ప్రకారం , ఏ ఎయిర్ లైన్స్ కి వికలాంగులైన ప్రయానికుణ్ణి కానీ కదలలేని స్థితి లో ఉన్న వ్యక్తిని గానీ వారు తెచ్చుకున్న, వారికీ అవసరమైన సహకార వస్తువులతో బాటు విమాన ప్రయాణం చెయ్యకూడదనే అధికారం లేదు.
సెక్షన్ 5.1,  ప్రకారం విమానాశ్రయం లో మరీ సహాయమార్ధించే వారికి తప్ప అక్కర్లేని వారు ఎటువంటి మెడికల్ క్లియరెన్స్ లేదా ప్రత్యెక ఫారంలు తప్పక ఇవ్వాల్సినవి లేవు . కేవలం అక్కడ దించడం విమానం వరకు తీసుకెళ్ళే సహయం తప్ప మరే అదనపు సహాయాన్ని అక్కర్లేని వారికీ ఇది వర్తిస్తుంది.
సెక్షన్ 5.2 మెడికల్ క్లియరెన్స్ ఎప్పుడు అవసరమౌతుందంటే ఒకవేళ ఎయిర్ లైన్స్ అధికారులకి ప్రయాణికుడి నుండి ఈ దిగువ ఇవ్వబడిన సమాచారం తెల్సి ఉన్నప్పుడు మాత్రమే.

1) ఆ ప్రయాణికుడు . లేదా ప్రయాణికురాలు ఏదైనా అందరికి వ్యాపించే జబ్బుతో బాధ పడుతున్నపుడు

2) కొన్ని వ్యాధుల కారణంగా విమాన యానం మధ్యలోనే ఏదైనా అత్యవసరత ఏర్పడే కరనమున్నప్పుడు , లేదా ఏదైనా ఎమెర్జెన్సి వచ్చి ప్రయాణికుల్ని దించాల్సి వచ్చినప్పుడు సాధ్యపడక పదనంటు వంటి కారణం

౩) లేదా ప్రయాణ సమయం లో కూడా మెడికల్ పరికరాలతో ప్రయాణించాల్సి వచ్చినప్పుడు .

4) ప్రయాణ కారణంగా మార్గ మద్యం లో ఏదైనా పరిస్తితి ప్రమాదకరంగా ఉండే స్థితి ఉంటే;

 

1329758055-Jeeja-Ghosh


నేను ఒక సెరిబ్రల్ పాల్సీ  కలిగిన దాన్ని– ఇది ఒక జబ్బు కాదు మెదడు దెబ్బ తిన్నందువల్ల కలిగే ఒక స్థితి.
విషయావగాహన, రూల్స్ గురించిన అజ్ఞానం తో కూడిన ఒక అమానవీయ సంఘటనగా, విద్యాధికులమనుకుంటున్న వారు చేస్తున్న నిర్వాకానికి తార్కాణంగా మిగులుతుంది. విమానం పైలెట్ ఒక బాధ్యత కలిగిన ఉద్యోగి. అతని నుండి ఇటువంటి ప్రవర్తన చాల సిగ్గుచేటుగా భావిస్తున్నాను.
ప్రభుత్వాన్ని , అంతే కాక, సాంఘిక న్యాయ సంబంధిత మంత్రిత్వ శాఖలన్నిటికీ, సివిల్ ఏవియేషన్ వారికీ  విషయాన్ని గంభీరమైన విషయంగా తీసుకోవాలని కోరుతున్నాను. ఎయిర్ లైన్స్ లో పనిచేసే సిబ్బందికి అన్ని స్థాయిల్లో పనిచేసేవారికి కూడా శిక్షణ అత్యవసరమని నేను భావిస్తున్నాను … శిక్షణ కుడా వికలాంగుల చేతనే ఇప్పించాలని తెలియజేస్తున్నాను.

సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ కి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే స్పైస్ జెట్ వారి మీద తక్షణం కఠిన చర్యను తీసుకోవాలని, ముఖ్యంగా కెప్టెన్ ఉత్ప్రభ్ తివారి మీద. ఆయన లాంటి మనస్తత్వం, వైఖరి కలిగిన వ్యక్తులకు అంతటి బాధ్యతాయుతమైన పదవి నిర్వహించే అధికారం లేదని చెప్తున్నాను.

 

నేను విమాన ప్రయాణం చెయ్యడానికి అనర్హురాలి నైతే అతను పైలట్ గా ఉండదగిన అర్హత లేని వాడు”.

(జీజా ఘోష్ యునియన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కి రాసిన లేఖ లోని ఫిబ్రవరి 21, 2012. తేదీన రాసిన లేఖలోని సంక్షిప్త అంశం. ఇండియన్ ఇన్స్టిట్యుట్ అఫ్ సెరిబ్రల్ పాలసీ, కొల్కొత, కి జీజ ఘోష్ అధినేత గా పని చేస్తున్నారు, మరియు అంకూర్ అనే సంస్థ ద్వారా వికలాంగుల హక్కులు, సాధికారం కోసం పని చేస్తున్నారు.)

జీజా ఆవేదన అనువాదం: జగద్ధాత్రి

గ్లోబల్ ఎయిడ్ సంస్థ కోసం..!

జీజా గురించిన వార్తలు  క్రింద లింక్స్ లో చూడవచ్చు.

 

http://www.youtube.com/watch?v=BXEW_pa9kjc

http://www.youtube.com/watch?v=lpe7azNqCr8&feature=related

http://www.sunday-guardian.com/news/civil-aviation-ministry-postpones-deadline-for-policy-inputs-after-activists-letter#.T0htQmwhmDc.facebook

 

 

ప్రకటనలు

3 thoughts on “నేను విమాన ప్రయాణం చెయ్యడానికి అనర్హురాలినైతే, అతను విమాన పైలట్ గా అనర్హుడు…

  1. arjuna rao karnati అంటున్నారు:

    yes…….this is damm thing…meedi kaani mee thappu ki meeru siksha anubhavistunnaru….kaani ituvanti neechulu thappu chesthu kudaaa samajamlo hundaaag abrathuku thunnaru…..you have to complaint about him for future sake atleast…..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s