మా వాళ్ళకు చెప్పు…

woman_tribal_maoist_orissa_adivasi

జనావాసాలకు అందనంత దూరంగా అరణ్యాలు

కారుణ్యాలే లేని చిక్కటి అరణ్యాలు

చీరలు లేని కొత్త  చెరల్లో

అరణ్య రోదన చేసే అక్కలు..

అన్నలు పట్టుకొనే గన్నుల్లా..

మాగన్నులో కూడా

మది విశ్రాంతి లేని కన్నుల్లా…

ఏమిచ్చినయి ఈ దినాలా అక్కలకి..

అడవిలో పడినా.. వదలని అంట్ల గిన్నెలా..?

గన్నుల బరువులతో పాటు గొడ్డు చాకిరీలా..?

బహిరంగ లైంగిక వేదనలా..??

ఆ అక్కల అసిధారా స్రవంతి ముందు..

నీ జన జీవన స్రవంతులెంత??

ఈ మహిళా దినాలు మాకొద్దు గానీ..

మా పురిటి కందుల నో సారి చూసుకోనివ్వు..

మైల పడని మా మనసునట్లాగే చూడు..

మా దేహాల త్యాగాలకి మాక్కాస్త గుర్తింపు నివ్వు..

నీ శ్రామిక రాజ్య యజ్ఞంలో..

మేమేసిన సమిధలను గౌరవించు..

నీ యెన్కౌంటర్ వార్తల్లో మాకూ ఓ పేజీ నివ్వు..

మా చావు కబురు మా పేరు తోనే

మా వాళ్ళకు చెప్పు..

–సాయి పద్మ

naxal_bastar_20100222

 

ప్రకటనలు

One thought on “మా వాళ్ళకు చెప్పు…

  1. వాసుదేవ్ అంటున్నారు:

    ప్రపంచ మహిళా దినోత్సవం నాడు ఎవరూ స్పృశించని వస్తువుని మీ తరహాలొ ఆర్ద్రంగా చిత్రీకరించారు. అవును వీరి మెసేజ్ ని ప్రపంచానికే చాటిచెప్పాలి అమ్మకే కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s