మౌన నగ్నత్వం…

Silenced 


తను నిలబడింది నా ముందు..

పారదర్శకమైన స్ఫటికంలా

పరాధీనమైన ఆత్మలా..

చుట్టూ ఉన్న వలువల పొరల చుట్టూ

మౌన గాజు బొమ్మలా

అతి జాగ్రత్తగా పదిలం చేసిన

అస్తిత్వాన్ని

చూడగలిగా నేను…

వందల వేల ఏళ్ళ నుంచీ కాపాడుకొస్తున్న

మౌనం..ఇంకా పదిలంగా ఉంది..

ఎక్కడో వినబడుతున్న గొంతు

తనదా..కాదా..అన్న సందేహం

పీడిస్తూనే ఉంది..

తను మాట్లాడగా వినలేదు నేను..

తన అస్తిత్వాన్ని

పాపాయి నగ్నత్వంలా చూడనూ లేదు..

ఆ ముసుగుల మాటున

అంతరాళంలో మెరుపై జలదరించిన

వెర్రి  కేక తనదేనా??

తన నిశ్శబ్దాన్ని.. నిస్సిగ్గుగా సిగ్గు ముద్ర వేసిన

నా జడత్వానిదా..??

ఒక్కరోజు ఆలోచిస్తేనే..

బాధ వేసింది..భయమూ వేసింది..

అదే దేహం వడలింది… సడలింది..

ప్రకాశవంతమవుతున్న ఆలోచనల తేజస్సులో..

వసి వాడిన దేహాన్ని…

చూస్తున్నా ఈనాడు..

దుఃఖంగా ఉంది..

పురాతనమైన ఆ నగ్నత్వంతో..

నిజంగా మాట్లడలేనందుకు…!!

యాతన తో నిండిన ఈ పరుగుల్లో ..

గాజు బొమ్మలకు అతుకులేసుకుంటూ..

బ్రతుకుతున్నందుకు…!!

baby_in_mothers_womb


–సాయి పద్మ

ప్రకటనలు

4 Comments Add yours

  1. jagathi అంటున్నారు:

    very touching poem ….the true angst of a woman’s heart who failed in her life….love j

  2. bhargav kumar అంటున్నారు:

    ardam kaledu madam.true ga.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s