నన్ను దఫన్ చెయ్యరూ….

Naqaab

 

అనాదిగా నేనొక ఒంటరి పహరాని

ఆడపిల్లల దేహాలు దాచే పరదాని

వేలాడుతుంటా ఎవరూ చూడని రూపురేఖలపై..

వయ్యారంగా..ఒకింత విసుగ్గా కూడా..

ఒక్క కళ్ళని మాత్రం చూపిస్తేనేం..

కల కందని కవిత్వాలల్లేవారున్నారు

బహు పరాక్ మీరంతా..

యమ హుషార్ నేను..

నల్ల గీతల వెనకాల ఏముందో..

ఎవరికీ అక్కర్లేదు..

చూసినా వాళ్ళకి పట్టింపూ లేదు..

బెహెన్ నుండి బేగం వరకూ

నేనెప్పుడూ ఆమెకు తోడే .

నన్ను మానేసి౦దా , నామర్దా..

రంగు రంగుల వలువలెన్నో

ఎవరి కళ్ళ బడకుండా

కప్పేస్తా నిర్దాక్షిణ్యంగా ..

నా వెనుక కళ్ళకీ

ఆవల ప్రపంచానికీ నేనే కాపలా తెర..

 pardah-in-islam

 

నేనొక నిరంతర పహరాని

ఎన్నోన్నో దాచా నాలో..

ప్రేమలు, మొహాలు, దాహాలు

తన్హాయీల ..జుదాయీలు ,

ఇజాజత్ లేని మోహబ్బత్లు

ఎన్నని చెప్పను..??

నన్ను తొడుక్కున్న

ఆమె దిల్ కీ ధడకన్ వింటాను .

జాలిగా…”సహేలిలా

అందుకేనేమో మరి..

మూడు సార్లంటే..ముప్పురికొనే బాధ

అది కుబూల్ అన్నా

తలాక్ తలాక్ తలాక్ అన్నా..

మరదే నా తక్దీర్ కదా

అమ్మీ జాన్లైనా..అబ్బాజాన్ లైనా..

వారి బచ్చీ బచావత్ కోసమే కదా వారి ఆత్రం

స్వేచ్చా రోజ్జ గాలి తగలనీయను ఇజ్జత్ కి..!!

నన్ను మోస్తున్న నా బెహెన్ల

కన్నీళ్లు నన్నూ ఏడిపిస్తాయి

వారికి జాని దుష్మన్ కాకుండా

నన్ను నేనే ఖతం చేసుకోవాలని

వారితో బాటే నేనూ ఏడుస్తా

 

 

నేనొక ఖాందాన్ కాపలాని

ఇంట్లో నా వాసం చిలక్కోయ్యే అయినా

ఇలాకా అంతా ఆమె నాతో తిరగాల్సిందే..

ఖాందాన్ పరువు..

దాని బరువు..

నా నల్లటి కౌగిలిలోనే కదా..

నేనూ దాచుకున్నా చాలానే..

గోరి చమడీ మీద సిగిరెట్ల మచ్చలు..

అప్పులోళ్ళ కేకల్లా..బెల్టు వాతలు..

కదిలే శవానికన్నా కావలసిందే పర్దా

ఎంతో మంది..” మర్ద్ కోపానికి

బలయ్యిన ఎందరో నా బెహెన్ల

ప్రాణాలు వేలాడే ఉరికొయ్య నా పతా!!!

    AfghanBurka

 

నేనొక కఫన్ ని వారి పాలిట

దేహంపై గీతల్లా..

సాగలేని తేమలేని పర్దాని..

నా వెనకాల కళ్ళేనాడో ఎండిపోయాయి

ముందున్న దునియా

ముసాఫిర్ల లోకాలు దాటి ముందుకేల్తానే ఉంది..

అప్పుడప్పుడు ఉతికి..ముతక వాసనేసే

నా మరణం నాకు తెలుస్తోంది..

షహీద్ అవటంలో స్వేచ్చా అర్ధమవుతోంది..

దయచేసి మీ దునియాదారీ లో నన్ను లాక్కండి..

పీలికలైన పలుచటి వస్త్రం..

మోసే అవసరం లేని బరువుని..

దాచే అర్ధం లేని పరువుని..

ఖననం చేయండి..

గట్టి గోరీ కట్టండి నాకు..

మళ్ళాజిందాచేసేందుకుఫర్యాద్చేయకుండా…!!!

సాయి పద్మ

ప్రకటనలు

4 thoughts on “నన్ను దఫన్ చెయ్యరూ….

 1. jagathi అంటున్నారు:

  dear sai u have taken a very universal problem of muslim women and really presented with empathy. if u go through Pakistani poetry and muslim countries women poetry we find a lot of such angst in their words about this parda or burkha practice. i appreciate ur empathy and concern about your sisters all around the world fscin thi problem. i congratulate you , if the poem does not have your byline it would definitely be thought a Muslim woman had written it. i really love and bless you for your concern for ban of a system thats really bothering and killing the spirit of Muslim women. this is a universal problem in all Muslim countries where religious fundamentalism is ruling the roost…u have written very well….love j

 2. Prabhakar Mandaara అంటున్నారు:


  పురుషాధిక్య , మత చాందసవాద వ్యవస్థలో నలిగి పోతున్న
  మహిళల పరిస్థితిని మీ సుదీర్ఘ కవిత కళ్ళకు కట్టినట్టు చిత్రించింది
  మళ్ళీ మళ్ళీ చదివితే కానీ కవితలోని డెప్త్ అర్ధం కాదేమో
  “దఫన్ , కఫన్, తన్హాయి జుదాయి, ఫర్యాద్ ” వంటి పదాలకు ఫుట్ నోట్ లో
  తెలుగు అర్ధాలను పొందుపరిస్తే బాగుంటుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s