నందన’వనంలో ఖరా’క్షరాలు

ugadi_pachadi_andhra_traditional_sweet_bitter_chutney

ఖర గట్టిగా శ్రీకారం చుట్టుకొనే లేదు..

నువ్వు ఒరగబెట్టింది చాల్లే అన్నట్లు

తోసుకుంటూ ముందుకి వచ్చేసింది.. నందన

నామాలు వేరైనా ..

రూపాలు ప్రకోపాలు ఒక్కటే అన్నట్లు..

తన పని తను చేసుకుంటున్నాడు కాలుడు..

పాత పాటలకు కొత్త పదాల్లా..

ఈ రీమిక్స్ కాలంలో.. మరి ఏ రీమేకు కోసమో…

అయినా ఏదో మారుతోంది..

దాష్టీకంగా.. తనలో తనే జ్వలిస్తూ

ఆ లావా లో అనేక అర్భాకాలన్నీ.. కలిపెస్తూ

వాటితో ఉంటూనే.. సముద్రమంత లోతైన భావంతో..

రమిస్తూ..పురోగమిస్తూ….

మార్పు అనేది.. అద్దంలో చందమామ చందం కాదు..

ఈ నందన నామంలో.. మనః మందారం కూడా అని చెప్తోంది..

ఈ మాత్రం భరోసా చాలదూ..

డెందం చెదరిపోకుండా..

నందనంలో ధైర్యానందాలతో అడుగేయటానికి….??

 

 

అందరికీ “నందన” ఆనందమయం కావాలని ఆశిస్తూ..ఆకాంక్షిస్తూ..ఉగాది శుభాకాంక్షలు..!!

–సాయి పద్మ

ప్రకటనలు

One thought on “నందన’వనంలో ఖరా’క్షరాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s