మనో’దహనం.…

6a00e54fce1e91883401348627aabb970c-320wi

 

వరుసలో చివరాఖరికి నా పేరు పిలిచేదాకా

తెలియలేదు…నాది చివర్లో పలికే కులమని..

 


పరీక్షలో కాపీ కొట్టావేమో..లంగా బొందు విప్పు పరీక్ష చేస్తా 

అవమానినించినపుడు …సంఘం తీరు తెన్ను తెలిసింది..

 


మాల దానికి మనసెందుకులే…మొగుడొస్తే చాలదా..

అన్నప్పుడు అర్ధమైంది.. ఇదో కొత్త అంటరానితనం అని..

 


నీతో పిల్లలోద్ద్దులే.. అయినా నీకు నేను నాకు నువ్వు ..

అంటుంటే..అవగతమైంది..ప్రేమికులం’లో కులం ఉందని..

 


కోటా లో వచ్చింది.. దీని మాట వినేదేంటిరా..

సహోద్యోగి స్వగతం.. ఆవిష్కరించింది నా గతం..!

 


“అది” ఇది’ అనటంలోనే బయటపడ్డ అహం..

అవసరమైతే అత్యాచారానికి వెరువదని.. అర్ధమైంది..!

 


మూల ప్రవృతి మారనంతవరకు..మంచితనం మాలతనమవుతుందని..

మనిషితనం నివ్వేరపోయినప్పుడే …అర్ధమైంది..

మనసుతనం ..మూగపోరాదని… మాట తీసుకుంది..!!


–సాయి పద్మ

nepal_1578450c

ప్రకటనలు

One thought on “మనో’దహనం.…

 1. Pragnya Pragnanand అంటున్నారు:

  ఔరా!!!
  కులమును కనిపెట్టితివి
  నీలోని కుళ్ళు అంతయునూ కక్కితివి
  కక్కిన కుళ్ళు యెంత ఉపద్రవామో జాతికి
  వ్యాపించగా విషపరినామాలు అవగతమయినా
  ఆవగింజంతయినా అడ్డరూ,
  నిర్మూలనకు తలపడరూ,
  మానవ ముసుగులోనున్న క్రూరాతిక్రూరులు
  కులవ్యవస్థను లతలా అల్లుకున్న లబ్దిదారులు
  ఈ జగములో ‘మృతసంజీవనీ’ లభ్యమవునేమోకానీ
  ‘కులనిర్మూలనీని’ కనిపెట్టుట కల్ల నందనా!
  కలవరపదేడవెల, ఓ పద్మనందనా!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s