ఆమె… విశ్వ పునీత …

Different-Moods-of-Women-pre

ఆమె కోపం….

అశనిపాతమై సుడి గాలిలా  చుట్టుకుంటుంది..

మమతంతా ఆవిరై..కఠినత్వపు పొరలో  కరిమబ్బవుతుంది..

అనుబంధాల్లోని అసహ్యాలను తరిమి కొడుతుంది

ఆకాశమంత వృత్తం గీచి…క్రూర  ప్రవృత్తులను  పరిహసిస్తుంది..

ఆమె రౌద్రం…

సంఘం పులిమే మాలిన్యాలను ఉడుపులా విదిలిస్తుంది 

నిరక్షర కుక్షులను సైతం..ప్రేమ ముముక్షువులను చేస్తుంది

అర్ధం లేని ఆచారాల తత్వాలకు తలొగ్గనంటుంది.

శరీరంపై దాడిని శవమై  ప్రతిఘటిస్తుంది..

ఆమె ఆకాంక్ష …

తన నైతికతను..అస్తిత్వంగా మలుస్తుంది..

అపహాస్యాలలోని  ఆశ్లీలతను ఆహుతి చేస్తుంది..

కొవ్వొత్తిని జ్వాలగా మారిస్తే…దహించివేస్తుంది..

నిర్భయ నిషాదాన్ని…పరీవ్యాప్తం  చేస్తుంది….

ఆమె ధైర్యం….

కుటిల  కుతూహలాలని …హలాహలంలా హవిస్తుంది

గొంతు దాటని గరళాన్ని…రౌద్రంగా విరజిమ్ముతుంది..

అవమానాస్పదులకు  సైతం  .. ప్రేమాస్పదమవుతుంది..

స్రవించని  గాయాల గతం వీడి … భావి   జీవితాన్ని గడిపేస్తుంది..

ఆమె విద్య….

తన మేధో సంపుటిలో.. వైయుక్తిక దిగుళ్ళన్నీ దహనిస్తుంది

అహాన్ని విదిలించే  స్వేచ్ఛా కాంక్షలో… తనివి తీరా స్నానిస్తుంది..

కట్టడి గీతల దారుల్లో.. ..విముక్తి రేఖలు గీస్తుంది

వ్యక్తి అధీనమైన సహనాన్ని, మేధనూ… విశ్వజనీనం  చేస్తుంది..

ఆమె క్రోధం ….

ధర్మాగ్రహమై …..అహంకార దావాగ్నులను

హరించి వేసి …..అనురాగ పుష్పాలు చివురింప జేసి

ఆకాశం లో తన సమ భాగాన్ని సాధించుకుంటుంది

విశ్వ జనహితమై ….ప్రపంచాన్ని పునీతం చేస్తుంది

–సాయి పద్మ

ప్రకటనలు

4 thoughts on “ఆమె… విశ్వ పునీత …

 1. Pragnya Pragnanand అంటున్నారు:

  పునీతమయిన క్షణాలు ఎన్ని?
  క్షణికం చాలు మళ్ళీ మార్పునకు
  అందుకే అనుక్షణం ‘జాగరూకత’ అనివార్యం
  అంతకన్నా ముక్యం, అలోచించి ఉంచుకో
  ‘అపాయంలో ఉపాయం’
  అది ఉపయోగంలోకి తెస్తే
  అదే ‘అనంతమయిన అండ’

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s