ప్రేమ సహజాతం….

557777_311477752259521_100001918963186_732003_1060604693_n

విరబూసిన  పారిజాతాలూ…పున్నాగలూ..

స్వచ్చమైనవన్నది.. ఒకనాటి మాట..

మిణుగుర్లు కూడా…మిన్నాగుల్లా జులుం చేయటం..ఈ నాటి పాట..

ఇలాంటి పాటల్లో… ఇహపరాలు చూడని అహాల  మొహాల్లో..

సహజత్వం అనే మాట… ఒక  రోతైన  కొత్త

అనుకున్నా…నిర్ణయించేసుకున్నా..

కానీ..

ఆమె నడక..నడత..విశ్వ సాహిత్యంపై యెనలేని మమకారం

బలహీనతల్ని…బాధితుల్ని ప్రేమించే గుణం..

అవలక్షణాలను.. సలక్షణంగా గౌరవించే మంచితనం..

కసిరేసే విసుగుని సైతం…మురిపెంగా మలచుకొనే వైనం..

అమ్మచేతి ముద్ద లా.. మా పై ఆందోళన..

అంతలోనే ఆత్రుత…క్షణంలో నిర్లిప్తత..

ఎన్ని పేర్ల మొహమాటాల…భయాలతో బాధించినా..

జగతం’తా ప్రేమ మయ౦ ఆమెకు .

మొదట్లో నవ్వుకున్నా…

తర్వాత అచ్చేరువొందా

ఆ పై అంతరించిపోతున్నఅనురాగం లో

ఇంకా మిగిలిన ….

ప్రేమ సహజాతమనుకున్నా..

అందుకే…ఆమె..

నాకెప్పటికీ సృజనాత్మకం …అనుసరణీయం..

సహజాతమైన  ఆ ప్రేమలో…

నిరంతర సన్నిహిత సంగీతమే..

నిర్ణిద్ర విశ్వ సాహిత్య సంభాషణమే ..

కదూ.. మిత్రులారా..??

–సాయి పద్మ

(సాహిత్యం కోసం..సంగీతం కోసం.. ప్రాణాలా? ఆవి మాకెంత ? అన్నట్లు తృణీకారంగా చూసే వాళ్ళు ఉన్నారని..చలం గారి గురించి..సౌరిస్  గురించి అనుకుంటుంటే విన్నాను. వీటితో పాటు..మానవాళి మీద  అవ్యాజమైన ప్రేమ  కురిపించే జగద్ధాత్రి గారిని చూసాక గానీ…ఆ  మాట అనుభవేకవైద్యం కాలేదు….నా మనసుకి అనిపించింది..మీతో పంచుకుందామని..సాయి పద్మ  )

ప్రకటనలు

5 thoughts on “ప్రేమ సహజాతం….

  1. pulipati guruswamy అంటున్నారు:

    గొప్ప వ్యక్తీకరణ…..ఒక్కోసారి అనుకున్నదంతా అక్షరాల్లోకి వచ్చిందా అనిపిస్తుంది….ప్రేమసహజాతం…ఆత్మీయ బంధానికి మరోపేరు….కదిలించింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s