ఏమందాం ఇక …ఏమీ మారలేదింకా..!!

 

తరతరాల  దాస్యం..

ఒకప్పుడు వాడే నశ్యంలా..

అప్పుడప్పుడూ వేసే జంధ్యంలా..

అన్నీ మారినట్టే అనిపిస్తాయి.. బయటకి…

ఏమీ మారలేదింకా..

పౌరోహిత్యం పోలేదింకా..!!

 

తడిమీ తడమక చూసే యజ్ఞోపవీతం..

అన్నిటికన్నా గొప్పది కులం.. పరమం..పవిత్రం..

అడిగీ అడగనట్టు అడిగే ఇంటిపేరు..

అదే మొదలు.. తప్పదింక జ్ఞాపకాల నెమరు..

ఏమీ మారలేదింకా..

పౌరోహిత్యం పోలేదింకా..!!

 

వినయం మా ఇంటిపేరు..

విజ్ఞానం మా సొంత వూరు..అంటే..

జీతం, జీవితం.. ఎగాస్ట్రా పనిముట్లు..

ఇంతకీ మీరేమిట్లు..??

ఏమీ మారలేదింకా..

పోరోహిత్యం పోలేదింకా..!!

 

–సాయి పద్మ

ప్రకటనలు

One Comment Add yours

  1. Jayashree అంటున్నారు:

    నిజమే పద్మా..
    ఏమీ మారలేదింకా..

    పేర్ల చివరి…మొదటి/తోక.. తలలు కూడా మారలేదు

    పౌరోహిత్యం పోలేదింకా..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s