అర్ధనిమీలిత అంతర్యామి….

540405_354175217962596_1197144813_n

చెరగని కాషాయ చిరునవ్వు..చల్లని…నీలపు ఫాలభాగం..

నలుచెరగులా..కోరికతో కీర్తించే జనం..

నిన్నే మాత్రం ఎమారనివ్వరన్నది పచ్చి నిజం..!!


పుసుపు పుండ్రాలు…తీరని జిహ్వ కేంద్రాలు..

తళ తళ మెరిసే వైతరిణీ బురద…

పులుముకున్న వారికి పులుముకున్నంత…అదొక సరదా!!


మోక్షగామితాలు…సాంద్రత లేని కమతాలూ..

మొల లోతు దాటిన మొహాల దాహాలూ..

అన్నీ నీకే సమర్పితాలు..!!


నల్లని క్షమత లేని చర్విత చరణాలు…

కాన్క లా తెగిపడిన .. వాంచల కాళ్ళూ చేతులూ..

సోహం కాని దాసోహాలూ…నాచు పట్టిన నీతి సూత్రాలు..!!


తామర తంపరలాంటి.. తీరని కాంక్షల వెల్లువ..

తామరాకు నీటి బొట్టే ..జీవితమనిపించే బోధల సారాల సత్తువ

త్రిశంకు ద్వారాల ..తీరాల వెంబడి మా పరుగు.. శివ శివా..!!


–సాయి పద్మ

(Inspired by the above painting by Mr. Krishna Ashok)

Sai Padma ://IPR All Rights Reserved

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s