అపుత్రస్య…

 

barren-women20060b

 

కొన్ని విషయాలు అర్ధం కావు ఎప్పటికీ..

రోజూ చూస్తున్నా అర్ధం కాని ఆకాశంలా..

 

అలతి అలతి అడుగులలో ఆసరా ఒక మాయ..

వెలితి నిండిన మనసు గోడు… వినే స్నేహితురాలి దయ.. 

 

చెరగని నవ్వుతో రేప్పార్పితే చెదురుతుందేమోనని 

మెలకువగా కనే ఒక కల..

 

తెల్లని ఇసుకపై నీ పాద ముద్రలు..

మసక చీకట్లలో..నన్ను తాకని నీ స్పర్శలు

 

సమాజం అడుగుజాడల్లో నడిచే నీ మగతనం ముందు..

కమిలిపోయిన మందారమే నా ఆడతనం..

 

ఆలోచనలు కలవని ఇద్దరాడవాళ్ళ మధ్య నిశ్శబ్దంలా..

రెండు గుడిసెల మధ్య మురిక్కాలవలా..

 

ఎటు వైపు  అడుగేసినా.. తప్పని నిరూపణం..

మధ్య శిలువెక్కుతోంది తప్పనిసరిగా.. అమ్మతనం..

 

పాలివ్వని స్తన్యాలలో కూడా దాగుంటుంది ఉప్పొంగే ప్రేమ..

ఇంకో ఆడదానికి కూడా అర్ధం కాని కన్నీళ్ళ చెమ్మ..

 

నీ, నా, ఆధిపత్య జన్యు లక్షణాలే…నువ్వు గర్వపడే సంతానం అయితే,

నీ సమాజ బానిసత్వం, నా మంచి చేతకానితనం ..రూపు కడితే వాళ్ళ గతేమిటి?

 

తరతరాల బానిసత్వాన్ని అర్ధం చేసుకోని మానవ జాతి..

తయారు చేస్తోంది పిరికితనపు పునాదులపై మరో కొత్త రెండర్ధాల నీతి..!!

వికలమైన వంధ్యత్వమే .. నేటి పుత్రస్య గతిర్నాస్తి…!!

 

–సాయి పద్మ 

ప్రకటనలు

4 Comments Add yours

 1. Krishna Ashok అంటున్నారు:

  chaala baagundi..!!

 2. mounasri mallik cine lyricist అంటున్నారు:

  Really gud poem -mounasri mallik cine lyricist

 3. saamaanyudu అంటున్నారు:

  సమాజం అడుగుజాడల్లో నడిచే నీ మగతనం ముందు..
  కమిలిపోయిన మందారమే నా ఆడతనం..
  ఇలా మీ గురించి మీరే రాయగలరు…చాలా గట్టి ప్రకటన చేసారు..అభినందనలు పద్మగారూ

 4. Eshwar అంటున్నారు:

  Nijam idi mana samajam lo vunna vivaksha…………

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s