కాలేజీ కథల వ్యక్తిత్వ కలల షామియానా- శ్యాం యానా…. మెడికో శ్యాం కథలు..

shyam

మెడికో శ్యాం గా ప్రసిద్ధులైన  డాక్టర్  చిర్రావూరి శ్యాం గారి కథల  గురించి ఇవాళ  మాట్లాడు కోవటం, భలే బాగుంది.. వైజాగ్  వాతావరణం లా.. ఉప్పు గాలి కి మనకి పట్టే ఉక్కలా..!

ఇవి కథలా…ఊహూ..కవితలా…కాదే… మరి భయానక  భీభత్స, సైకో అనాలసిస్ లా… అయ్యో..కాదండీ.. కానే కాదు.. మ్యూసింగ్స్  లాంటి.. కవితాత్మక వచనం..!! మొదట  గాలి thrust వల్ల  నడిచాను..తర్వాత నడవాలని నడిచాను.. నడవలేక  ఆగాను..ఆగి గతం తలచాను…ఇంతకీ నడిచానా లేదా.. అని తనని తనే ప్రశ్నించుకొని, మారని కాలాన్ని వడసి పట్టి, తనదైన  చమక్కు తో, చురుకు మనేలా మనకి అందించారు.. వీటికి ఉదాహరణ..కథకుని కథ, ఆలోచనల ట్రైన్ లో, సాహిత్యం కథ, కవి గారి కళత్రం లాంటి కథలు..

ఈ కథలు చదవటం ఒక  అనుభవం.. అన్ని అనుభావాల్లాగే..ఎవరికి వారు అనుభవించి.. కథకుడు చెప్పిన విషయాల్ని అర్ధం చేసుకొని, చెప్పలేని భావాన్ని కూడా ఆస్వాదించేలా చేస్తాయి. ఒక్కోసారి ఇది ఒక  కొటేషన్ల పుస్తకంలా అనిపిస్తుంది.. మరో సారి.. జీవన సారాన్ని కాచి వడపోసిన  వైద్య  వృత్తిలో మనుషుల శరీరాల్ని,  రచయితగా వాళ్ళ మానసిక  ప్రవృత్తులను కూడా ..యవ్వన గీతలంత స్పష్టంగా చెప్తారు.

ఒక్కోసారి..శ్యాం గారి ఎలక్తడ్ థాట్స్ లాంటి..ఈ కథలు చదువుతుంటే.. మన ఆత్మని మనం స్పర్శిస్తున్నట్టు ఉంటుంది..ఈ ముసుగులన్నీ తీసి మానవత్వం వైపు.. కొత్త ముసుగులు వేసుకొని..వాటిని అర్ధం చేసుకొనే మనుష్యుల వైపు.. వాళ్ళ మనసుల వైపు మనల్ని నడిపిస్తాయి..

నాకున్న సేక్తోరియాల్  చదువరులు నాకు చాలు అని రచయిత ధైర్యంగా చెప్పగలిగినా…అంత నిజాయితీ ని కావాలనుకుంటూ కూడా …భరించలేని మనుషులు, కూడా ఏకాంతంలో.. నిజాన్ని ఒప్పుకుని….ఒక సంజాయిషీ లాంటి.. సంవేదన పడేలా చేసే కథలివి..!!

కాదేదీ కవిత కనర్హం.. అన్నారు కవి వర్యులు.. శ్యాం గారి లాంటి వారి చేతిలో పడితే, కాఫీ, ముక్కుపుడక, యెర్ర  జాకెట్టు, మెత్త బుగ్గలు కూడా అద్భుత  కథా వస్తువులవుతాయని.. ఇందులో కథలు చదివితే తెలుస్తుంది.

ఇక.. వ్యక్తిగా సామాజిక దృక్పధాన్ని…మనలోని మారని తనాన్ని, యిట్టె చెప్తాయి ఈ కథలు, ప్రత్యక ఉదాహరణ, డౌరీ హౌ మచ్..? లాంటి కథలు.. ఈ రచయిత ఈ కథలన్నీ అతని విద్యా కాలంలో అంటే అరవై డెభై దశకాల్లో రాసారంట.. నిజం…కుర్ర డాక్టర్ల కలల షామియానా మీద ఒట్టు..!! 

కొన్ని కథలు, మ్యూసింగ్స్ మాత్రమే రాసినా.. అవన్నీ ఒక కావ్యంలా అనిపిస్తాయి…సామాజిక పరిస్తుతలపైన అశక్తతని కూడా.. అందమైన కవితాత్మక సందేశాలు.. మనల్ని హడావిడి పెట్టకుండా ఆలోచింపచేస్తాయి. ఉయ్యాలలో కూర్చున్న వాళ్ళు ముందుకే కాదు..వెనక్కి కూడా ఊగుతారు.. ఎక్కువగా తూగకుండా ఈ కథలు మనల్ని మానవత్వం వైపుకి వడిసి పట్టటం ఖాయం..

ఇలాంటి కథకులు.. అమెరికాలో స్థిరపడ్డ.. ఆంద్రులు కాబట్టి.. అక్కడి వాతావరణ, పోకడలూ, వదంతుల విపరీత నడకలూ.. కూడా రాయగలిగి రాయకపోవటం.. తెలుగు సాహిత్యానికి తీరని అన్యాయం..దారుణం..

ఇంత చల్లటి షామియానా ని సిద్ధం చేసిన.. వంగూరి ఫౌండేషన్.. వారికి ప్రణామం..

చివరగా ఒక్క మాట.. “నడిచే పుస్తకం” అని పిలవబడ్డ శర్మ గారి అబ్బాయిగా మాత్రమే కాకుండా.. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సాహిత్యాల, సంగీతాల స్ఫూర్తిని ఆదాట్టున అలవోకగా అందిపుచ్చుకొని…నడుస్తున్న కథ లాంటి రచయిత మీరు.. మీ అంతః సీమని మరింత మధించి.. మంచి ప్రయోజనాలే కాదు.. మానవ స్వభావాలని సాహిత్య పరం చేస్తారని మా చిన్న ఆశ..!!

–సాయి పద్మ మూర్తి.

[ఆంధ్ర భూమి లో ప్రచురితమైన రివ్యూ -సాయి పద్మ ]

ప్రకటనలు

One thought on “కాలేజీ కథల వ్యక్తిత్వ కలల షామియానా- శ్యాం యానా…. మెడికో శ్యాం కథలు..

  1. Narayanaswamy అంటున్నారు:

    శ్యాం గారి రచనల్లోని ఆత్మని సరిగ్గా పట్టుకున్నారు. ఆయన వచనమెంత హాయిగా ఉన్నదో, మీ సమీక్ష అంత సూటిగా ఉన్నది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s