నన్నెవులూ అడగలా..

Hamlet Pic

గుభీల్మని ఒక్కట్టిచ్చుకుంది మా యమ్మ..

ఏటే..నంజా…. మీ బావకన్నా

ఏ మొగుడు లగేత్తుకోత్తాడే ..అని..

ఎలపటా.. దాపటా …మయాన్న టైం నేకుండా 

అగుమేగాల మీన లగ్గమేట్టిచ్చినాది..

నీకిట్టమా… అని..

నన్నెవులూ అడగలా…

 

 

కోడికూసే యాల బోరింగ్ కొట్టే కాడ్నుంచీ..

రాత్రేల మా యప్ప కి కూడెట్టి..

బావ పక్కల తొంగునేదాకా ..

కన్న బుడ్డడికి చేపకుండా 

పచ్చి వొల్లుతో పని సేత్తానే ఉన్నా..

మా యప్పమో ఆడికి అమ్మైంది..

నానేమో..సిన్నమ్మ నయ్యా..

నానేటీ అనలా.. నన్నెవులూ అడగలా…

 

 

బుడ్డడ్ని కూల్లో ఏసి

మా యప్ప బావ దేశమ్మీద..

కూలికేలిపోనారు..

ఇల్లు సూసుకుంటూ..దాకంత లేని ఆ గుడిసెలో..

సంకు రేత్రి ..శివ రేత్రి నేకుండా

ఎంత కౌకిలన్నా పడతానే ఉన్నా..

ఇదిగిదిగో లగ్గేత్తుకొత్తా మన్నోలేవలూ ..

అయిపూ..ఆజా అగుపళ్ళా

నన్నేవలూ అడగలా..

 

 

ఎవులూ రాని… ఈ గుడిసేటి దాని కాడ కొచ్చి..

నీ కుటమానం ఏటి.. పెనిమిటేడీ 

నీ హక్కు నీకు తెలుసా అనడిగితే..

నాకేటి తెల్సు సారూ..

హక్కంటే ఎటో…మా యప్ప బావ సెప్పలా..

నీకు కావాలా హక్కని 

నన్నేవలూ అడగలా…!!!

 

–సాయి పద్మ

stemming the tide copy

 

[గ్రామాల్లో, తండాల్లో ఒంటరిగా బ్రతుకుతున్న ఎంతో మంది మహిళలు…మాకూ హక్కులు అనేవి ఉంటాయా అని అమాయకంగా అడుగుతున్నప్పుడు.. మాతో ఉన్న ఒక అమెరికన్ మహిళ అన్నారు.. ఆశ్చర్యపోతూ.. ఇంకా ఇలాంటి వాళ్ళున్నారా..అంటే.. నేను చెప్పిన సమాధానం…ఆశ్చర్యం ఒకటే .. మీకు, మాకు తెలిసిన ప్రపంచాల మధ్య.. మాది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న కొత్త లోకపు ఆశ్చర్యం..మీది అన్నీ తెలుసుకొని మాపై ఉన్న  కుతూహలం అని.. ఎందుకో.. రాయాలనిపించి ఇలా……… సాయి పద్మ]

ప్రకటనలు

3 Comments Add yours

 1. siva అంటున్నారు:

  చాలా భాగుంది నండూరి వారి వెంకిలా.

 2. Pragnanand అంటున్నారు:

  తమ్మి మొగ్గలు ఉద్భవించి నవమాసాలు కాకముందే (259 రోజులు) యాబై మొగ్గలను పూయించిన సందర్బంగా మీకు నా హృదయాభినందనలు.

  19/11/2011 న ‘మెదడులోని మనస్సు’ నుండి 08/07/2012 ‘ నన్నేవులూ అడగాలా’ వరకు తన మెదడులో మెదిలిన భావాల సమాహారమే మనము తమ్మి మొగ్గలులో చదువుకునేవి. అంతా బాగున్నట్టే కనిపించినా నాకో వెలితి కనబడుతుంది. ఎక్కడా మీ ‘ప్యారడీ పాటల’ హాస్య సుగంధాలు వెలువడటంలేదు.అవి ఎప్పటికి వెలుగు చూస్తాయో ఎదురు చూద్దాం. సాహిత్యాభినందనలతో…….ప్రజ్ఞానంద్

  1. raja mullapudi అంటున్నారు:

   chala bagundi

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s