ఆ నవ్వే…

connection_3

 

నవ్వులు కాల్చేస్తాయనుకోలేదిన్నాళ్ళూ,

అణువణువునా…నిలువెల్లా

నీ పదాలు తాకే చోటల్లా..

నీ ఆత్మీయ స్పర్శ తెలిసే జాడల్లా..

నరనరంలో…కణకణంలో..

కుదుళ్ళలో..మెదళ్ల చివుళ్ళలో…

అంతటా నీ నవ్వే..

అన్నిటా నా నువ్వే..

భగ్గుమన్న నవ్వులే..

శబ్దం లేకుండా భళ్లుమన్నట్లు..

కళ్ళకొసల్లో ఉన్నా నన్ను తాకుతున్నది

నీ నవ్వే..

కార్చిచ్చులా నీ కళ్ళలో మొదలై

నా మనసంతా నిండుతున్నది నీ నవ్వే..

 Eye-close-focus1-560x420                                                                                        

 ఇంతకీ..

 నీ మాటలా నిశ్శబ్దంతో నిండకుండా..

నీ కళ్ళు నన్ను చూసి నవ్వుతాఎందుకు..?

నేనంటే అంత చులకనా..??

దాహమో..మోహమో..స్నేహమో..

ఏదీ కాని నిర్భయ కాంక్షల దేహమో..

ఏదన్నా..ఏమనుకున్నా..

నేను నువ్వే కదా…

అందుకేనా ఈ నవ్వు…???

 

–సాయి పద్మ

ప్రకటనలు

One Comment Add yours

  1. padma4245.blogspot.com అంటున్నారు:

    మరి నా నవ్వో? 🙂
    బాగారాసారండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s