రహదారి మొక్కలు…

 

image

 

నడకల మెలికల దారులు..

బూజుల్లా పట్టి వదలని నిజాల నీడలు..

విపరీత అభివృద్ది కి ఆనవాలులా రోడ్లు

ఇరుప్రక్కలా వృక్షాల్లా ముదితలు..

వృక్షాలా.. కాదు కాదుపదమూడు పద్నాలుగేళ్ళ మొక్కలే..

వృక్షాలుగా మారని..మారలేని మొక్కలు..

కలుపులా తీయలేని..ఎవరితో కలవలేని మొక్కలు..

వాంచా వాసనల చెమట చుక్కలు..

అభివృద్ది ఎడారిలో మధ్య తరగతి క్రోటను మొక్కలు..

పగటి పరిష్వంగంలో రాత్రి గాయాలను మర్చిపోయే చుక్కలు..

పగలు కూడా విశ్రాంతి ఎక్కడ…??

వసతుల కోసమో, వనరుల కోసమో.. విలాసాల కోసమో

పగలూ రాత్రీ లేకుండా పని తప్పదు..

అడుగడుగునా అలవాటుగా అందుబాటులో ఉండక తప్పదు..

ఎదుగుతోంది రహదారి వ్యాపారం..

మనం అందంగా పెంచుకొనే మరుగుజ్జు మొక్కల్లా..

మామూలుఖాకీల వ్యంగ్య పరిహాసంలా..

వాడి పడేసిన మల్లెల దండల్లా..

చిన్న పిల్లలు ఊదే కండోం బూరాలా..

అక్కడక్కడా పచ్చి గా కనబడే గాయాలు..

ఉన్మత్త కామంలో ఉసురు తీసే రోగాలు..

బాధితులకు తప్ప అందరికీ చుట్టలైన చట్టాలు..

చుట్టి పడేసిన బిరియానీ పొట్లాలు..

అలవోకగా అనిపించే స్కాచ్ రాజకీయాలు..

అలవాటు లేని అలంకరణలో ఆవిరైపోయిన భాష్ప కణాలు..

ఆశీర్వాదంలా అనిపించే తిట్ల అగ్ని ప్రవాహాలు..

రుణ భారంలా పెరిగిన భ్రూణ హత్యా భారాలు..

అయినా పచ్చదనం మీదున్న శ్రద్ధ.. పచ్చి నెత్తుటి గాయాలపై

ఎందుకుంటుంది..

ముసురేసిన మస్తిష్కాలే కదా.. మానవ ప్రగతి కొలబద్దలు

ఇప్పుడు ఊరి చివర ఇల్లు కోసం వెతకక్కరలేదు..

దారి తప్పారని జాలి చూపనవసరం లేదు..

శీలానికీఅశ్లీలానికీ మధ్య.. గోడ లేదు కాబట్టి

గొడవే లేదు..

కొత్త అంటరాని తనానికి పరిధీ లేదు..

దారి పొడుగునా స్వాగతాలే

అసంతృప్త దేహ వైరాగ్యాలే..

అదృష్టవంతులు విసుక్కుంటున్నా..

ఐశ్వర్యవంతులు ఆసక్తి కనపర్చినా..

అభివృద్ది వాదులు తీవ్రంగా నిరసించినా..

ఎవరేమైనా..ఏదేమైనా..ఇంకేమైనా..కాకపోయినా..

అయినా..

అయినా తప్పదు మరి..ఎందుకంటె..

ఇప్పుడెవరూ ఆడపిల్లల్ని చంపటం లేదు..

బతకనిచ్చినందుకు బాడుగ చెల్లించాలిగా మరి…!!!!!

 

 

[జాతీయ రహదారుల కిరువైపులా హై వే సెక్స్ వ్యాపారం పెరుగుతోంది. అడ్డు అదుపూ లేని విధంగా..చాలా వరకు ఈ పడుపు వృత్తి చేస్తున్నది ఇంక టీనేజి దాటని ఆడపిల్లలే. చేస్తున్న చిన్న చిన్న వృత్తి పనులు లేకపోవటం. పడుపు వృత్తి లో వచ్చే ఆదాయం కూడా కూడా ఒక కారణం కావచ్చు. చుట్టు ప్రక్కల గ్రామాల నుండి వచ్చి ఈ వృతి చేస్తున్నారు. ఈ వలస వృత్తిలో వాళ్ళకంటూ ఏ రక్షణా లేదు. ఏదేమైనా, ఆరోగ్య పరంగా ఏ భద్రతా లేని ఈ వృత్తి వల్ల ఒక తరం ప్రమాదంలో ఉందన్నది సత్యం!]

 

© Sai Padma ://All Rights Reserved

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s