పసుప్పచ్చ జైలు…

shutterstock_62897815-Yellow-Door-India-705x335

 

వదిలివెళ్లావు నన్ను..
పసుపురంగు జైలులో..
గుమ్మాలు పసుపు.. నీ వలపు పసుపు..
నా మెడ పసుపు..
నీ కాంక్ష ఎరుపు..
లోకమంతా నాకేమో మెరుపు..
బానే ఉంది..ఈ వింతగా
కొంచం కొత్తగా ఉన్న ఖైదులో..
తప్పెట్లు ఎప్పుడో మోగాయి గాని..
తాళాలు ఎక్కడా కనపడలేదు..
హమ్మయ్య.. ఇది నాది..
నాకెంత స్వతంత్రమో..
ఆడాను..పాడాను..
తిరిగాను..
వంటింట్లో నుంచి ..వీదిలో దాకా..
అడిగేవారేవ్వరూ లేరు తెలుసా..
నాదే ఈ ప్రపంచం..అనుకున్నా..
“ఒక్క రూపాయి సంపాదిస్తే తెలుస్తుంది..”
అన్న మాటతో వచ్చి పడ్డా..
ఇలలో..కలనుంచి..
నిజమే కదా…
చదువు మర్చిపోయా.. పోపు మెదుపు గుర్తుంది..
చురుకు మర్చిపోయా.. చక చక పని గుర్తుంది..
మాట మర్చిపోయా.. అవుననడం గుర్తుంది..
నవ్వటం మర్చిపోయా.. బాధ్యత గుర్తుంది..
కళలు మర్చిపోయా…కలలు ఆగటం లేదు..
ఇప్పుడు కూడా పసుపు జైలు బానే ఉంది..
జైలు బయట ప్రపంచం కలల్లోకి కూడా రావటం లేదు మరి…!!!

yellow_door_jodhpur_rajasthan_india_u24-719689


–సాయి పద్మ

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s