మార్గ మధ్యంలో…

dsc00375_thumb

 

నేనేంటో నాకే తెలియనప్పుడు

పరిచయమైందో మస్తిష్కం లాంటి హస్తం..

నమ్మకంగా.. గోదాట్లో బల్లకట్టులా

మొదలెట్టా మరి లంక మేత గోదారి ఈత

అస్సలిప్పటికీ అర్ధం కాలేదు

నమ్మకాల బల్లకట్టుకి

నాచెప్పుడు పట్టిందో..

ఏ చెప్పుడు మాటలు విందో..

మూడో మనుషులూ.. తీసేసే గడ్డి పోచలూ సరే..

నమ్మించి ప్రయాణం మొదలెట్టటం ఎందుకు??

ఆనవాలు కనబడని నావలా..

తీరా.. సహం పయనమయ్యాక

మనసు హూనమయ్యే మాటలెందుకు..??

తీరా చూద్దునా..

చుట్టూ అందమైన నీళ్ళే…

అమాయకంగా.. దూకడానికి తప్ప బ్రతకటానికి పనికి రాక..!

చేప పిల్ల పాటి తెలివి లేకపోయింది కదా..!!

ఈతరాకుండా.. నీ ప్రమాణాల ప్రయాణం మొదలెట్టేటప్పుడు..!!

ఇప్పుడీ సూత్రాలు వల్లించి ఏం లాభం..?

మంగళ సూత్రానికి బందీ అయ్యాక…!!

 

–సాయి పద్మ

ప్రకటనలు

4 thoughts on “మార్గ మధ్యంలో…

 1. Jayashree అంటున్నారు:

  అంతరంగ తరంగం
  భావనల సునామీ
  ఆలాపించే ఆవేదనా
  హ్మ్మ్
  యే జీవితానికైన యీ వెనుక ముందుల బేరీజులు తప్పవు పద్మా
  యెప్పుడూ మనము ఒకేలా వుండము..and life also never a constant factor

  **నమ్మకాల బల్లకట్టుకి

  నాచెప్పుడు పట్టిందో..

  ఏ చెప్పుడు మాటలు విందో..

  మూడో మనుషులూ.. తీసేసే గడ్డి పోచలూ సరే..

  నమ్మించి ప్రయాణం మొదలెట్టటం ఎందుకు??**

  జీవితానికి అందాన్నిచ్చేదే నమ్మకాన్నిచ్చే ప్రయాణం
  ఆ సమయం లో ఆ భావనే అద్భుతం
  అలాగే ఇప్పుడు అనుభవించే యాతన కూడా!

  బాధలకూ భావనలకూ పై రూపులో ఎదిగి
  నీలో నువ్వుగా నిలబడు.. చేపపిల్లకు ఈత ఎవరు నేర్పారు.. కాస్సెపు నువ్వు కూడా ఆ చేపపిల్లవే అనుకో ఈత అదే వస్తుంది!

 2. the tree అంటున్నారు:

  చుట్టూ అందమైన నీళ్ళే…

  అమాయకంగా.. దూకడానికి తప్ప బ్రతకటానికి పనికి రాక..!

  చేప పిల్ల పాటి తెలివి లేకపోయింది కదా..!!
  చక్కగా రాశారండి,అభినందనలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s