నిశ్శబ్దం..

tumblr_m7ymmbKyl91qc6wuio1_r2_500

 

పెద్దగా అరచుకోం మనం

తెలివైన వాళ్ళం కదూ..

పైగా మేధావులం..

నా వంట నేనూ..

దాంతో పాటు

నీ మౌనం నువ్వూ

భోంచేస్తాం..

అంట్ల గిన్నేల్లా..

మన గొడవలు కూడా

సింక్ లో పడేసి ఉంటె

బాగుండునేమో..

వాటినలా పడగ్గది లో మోసుకోస్తాం…

కిటికీ ప్రపంచంలోంచి..

ఎదురింటి లేబరోళ్ళ..

నిషా గొడవల్ని

ఈర్ష్యగా చూస్తూ నేను..

టీవిలో….కొత్త సమీకరణాలు

అభావంగా  చూస్తూ నువ్వు..

జాగ్రత్తగా నిశ్శబ్దాన్ని

పొద్దుటకి పట్టుకుపోతాం..

తెలివైన వాళ్ళం కదూ..

మేధావులం కూడా..

–సాయి పద్మ

ప్రకటనలు

2 Comments Add yours

  1. the tree అంటున్నారు:

    చక్కగా రాశారు,అభినందనలు, వీలైతే నా కవిత ఈ బంధం దృడమైనది చదవండి.ఇలానే వుంటుందది.
    http://bhaskar321.blogspot.in/2012/06/blog-post_12.html

    1. తమ్మి మొగ్గలు అంటున్నారు:

      thank you so much andee.. for your encouragement. nijam mee post chadivaanu.. chala baagundi.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s