నేనొక ల….కుని

1342862804_Noguchi Mother and Child 1944

ఆమె కావిలించుకున్నప్పుడల్లా..
ఒక సందేహం..
ఒక జన్మ దుఖం..
ఒక అబద్దం..
కర్ణాకర్ణిగా..ఎక్కడో అన్నట్టు
నా జన్మలాంటి అబద్ధం
నన్ను ఎవడికో కన్నదన్న నిజం..
ఒక నిట్టూర్పులా
ఒక స్వచ్ఛమైన నిజంలా..
స్వచ్ఛత అంత అబద్ధం మరోటి లేదు..
సోమిదమ్మ సొగసుగాళ్ళను కోరితే
సోమయాజి స్వర్గారోహుడయ్యేనా..
అన్నాడు త్యాగరాజు..
ఎంత మందిని కోరి నన్ను కన్నదో
ఆలోచన నిలువ నీయదు..
దివారాత్రం తెలవ నీయదు
ఫేటీల్మని పలికిందో స్వరం..
అచేతనావనిలో…
అమలినంగా..
“ఎవడికి కన్నా..తనే కన్నది కదా..”
నవమాసాలు నన్ను మోసుకు తిరిగే..
శరీరపు సంచీ తనదే కదా..
అమ్మ నిజం.. నాన్న నమ్మకం..
అన్న నిజం అనుభవించేసరికి..
తెలిసింది ఆ జన్మ బంధం
శుష్కించిన అమ్మ శరీరం
నిర్లిప్తంలో..నేను నిర్లక్ష్యం చేసిన
ఆమె ప్రేమ..
వృద్ధాశ్రమంలో అమ్మ..
అమ్మ ప్రేమ వంచితాశ్రమంలో నేను..
ఎలా చూపెట్టను..??
గత అత్మీయతల ఆనవాలును
ఇప్పుడయ్యా నేను నిజంగా
లంజా కొడుకును..
–సాయి పద్మ
(అర్ధం లేని శీలానికి ప్రాధాన్యత ఇచ్చి.. అవగతమయ్యే ప్రేమని నిర్లక్ష్యం చేసిన కొడుకులందరికీ..అంకితం)

ప్రకటనలు

3 thoughts on “నేనొక ల….కుని

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s