తమ దాకా …

 

ఒకే వొరలో రెండు కత్తులు

సర్దుకున్నట్టే అనిపిస్తాయి

దూయాల్సిన  అవసరం రానంత వరకూ…

 

నేనొక దుర్గం..నాదొక స్వర్గం 

అనుకోవటం వరకూ బానే ఉంటుంది..

తిరస్కృత  సంఘం అవసరం రానంత వరకూ..

 

నేను దేవుడ్ని నమ్మను..

మనిషే దైవం…ఇలా అయితే కష్టమే….

నిజమైన కష్టంలో దైవాన్ని చూడనంత వరకూ..

 

నా జీవితం.. నా ఇష్టం…

నా ప్రణాళికలు..నా పరిచయాలు..

నమ్ముకున్నదంతా గతంలా మారనంత వరకూ..

 

సామూహిక మనస్తత్వం..నాకహ్యం

మందలో గొర్రెపిల్లని కాను నేను..

కనుచూపు మేరల్లో..కనపడని మంద కోసం..బెంగటిల్ల నంతవరకూ ..

 

సాహిత్యలోకాలా.. నాకవి కూపాలు..

సంగీతం..నాకర్ధం కాదు..

మడ్డిలో మెరమెర లాడే మరకతాల్ని చూడనంతవరకూ 

 

ప్రాచీన అర్వాచీనమంటే నా ప్రాణం

సాంప్రదాయంలో.. నా తర్వాతే ఎవరైనా..

కరడుగట్టిన …అందులోని హింస అనుభవించనంత వరకూ..

 

జీవితాన్ని చదివేదేముంది…

జరిగేదేదో జరుగుతుంది..

మూలాల్ని కదిపే మానవత్వ స్పర్శ తగిలి జలదరించనంత వరకూ…

–సాయి పద్మ

ప్రకటనలు

One thought on “తమ దాకా …

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s