మేధో పరాక్..!!

mosaic-angel-final

కవిత్వ మిలిటెంట్లు..

వేరేగా కనబడని టెంట్లు..

ఎవరి గుడారం వాళ్ళదే..

ఎవరి వాదం కూడా..

మరదే వాళ్ళకి వేదం..

జీవనంలో.. ప్రవచనంలో..

మేధని తోక్కేయటం ఎంతో ఇష్టం..

అమ్మాయిదైతే మరీను..

పెద్దగా అడ్డుకొలేదుగా..

బలాత్కారానికైనా..

నీచ చమత్కారానికైన..

ఇలా దేనికీ లొంగకపోతే..

ఉందిగా దైహిక వాంఛల ఉచ్చు..

కనీసం.. తరతరాలుగా పాతబడి,

నానిన జీర్ణావస్థలో ఉన్నా ఉచ్చులైనా మార్చరు..

పని జరుగుతోందిగా.. దైనందినం..

ఒక మేధావి వెనుక

కొట్టే చప్పట్ల నిశ్శబ్దంలో..

శబ్దం లేకుండా కలుస్తుంది..

చమక్కుమనే మహిళా అస్తిత్వం, వ్యక్తిత్వం..

మేధని భరించలేక భళ్లుమని

వాంతి లా బయటపడుతుంది.. మగ మేధావి తత్వం..

మిలిటేన్సీ అంటూ గోల చేస్తారెందుకు..

మన మూలాల్లో ఉన్నది.. అదేగా..!!

Women's Domination

–సాయి పద్మ

(కొంతమంది కవులు మిలిటెంట్లు.. అన్న శ్రీ కవన శర్మ వాక్యం..దీనికి ప్రేరణ..మిగతాది కొన్ని నిశ్శబ్దాలను చూసిన నా అసహనం..)

ప్రకటనలు

One thought on “మేధో పరాక్..!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s