మాకు…మేమే..!!

article-new_ehow_images_a06_du_6u_civil-rights-gay-marriage-1.1-800x800

మారీ మారని శరీరం,

మారుతున్న మనసు.

నేనేమిటో నా ఒక్కడికే తెలుసు..

మీకు నచ్చినట్లే బ్రతికా..

తెచ్చిన బట్టలు కట్టుకున్నా..

ఏదీ నచ్చని స్థితి..

నా వాళ్ళు నచ్చే పరిస్థితి..

నా వాళ్ళంటే నా సహచరులు..

మిత్రులు..మగవాళ్ళు..

ప్రేమంటే.. ఆడా..మగా మాత్రమేనా?

మరి మీరు చూపించే ప్రేమ ధర్మమా..నాన్నా..

మీరు తప్పంటారు..

నా మనసు ఒప్పనంటోంది..

మీకు సిగ్గంటారు..

నాకు సహజం అనిపిస్తోంది..

అడగందే అన్నీ ఇస్తారు..

మనసులో కావలసింది తప్ప..

స్వలింగం తప్పంటే..

మన కులం..మతం..ధర్మం..అంటూ..

మీరు చేసే సంకుచిత స్వధర్మాన్ని ఏమంటారు..?

స్వలింగ సంపర్కం..

కోర్ట్లూ.. చట్టాలూ.. ఒప్పుకున్నాయిగా..

కానీ అవి నా హక్కులు మాత్రమే..

మీ మనస్సులో.. తోమబడ్డ ప్రేమ భావజాలానికి

సమాజపు సంకేళ్ళకి..

ఎంతటి వారైనా ..బద్దులు కావలసిందే..

సంఘానికి కావలసింది.. మన మనశ్శాంతి

కాదని తెలిసినా.. మీకేదో అశాంతి..

ఏదైనా..  సరైనది కాదని ఎవరైనా ఎలా చెప్పగలరు..

మీ గాయాలు మీకుంటే..

మా భయాలు మాకున్నాయి..

మమ్మల్ని మేం అర్ధం చేసుకోవాలంటే..

మా ప్రేమ ఆలంబన అని మీకెందుకు అర్ధం కాదు..

అయినా..ఛీ కొట్టే ఆడవాళ్ళ కన్నా..

మాతో సహజీవనం చేసే మగవాళ్ళే మిన్న..

ఎవరో తెలియని సంఘ లింగాల కోసం..

మా లైంగిక హక్కులు కాలరాస్తే ఎలా..?

కొత్తదే కావచ్చు.. మీకు చేత్తదే కావచ్చు..

మా స్వరం మాకుంది..

ఈ తరం మాదైంది..

మీ చీత్కారాలు మీదగ్గరే ఉంచుకోండి..

మా ధిక్కార సంగీతం ..మేం పాడుతూనే ఉంటాం..

ఈ లోగా.. “మగాడివి నువ్వు” అనే వంకతో,

ఒక వెన్నెలమ్మ లాంటి ఆడపిల్ల జీవితం..

మా వల్ల నాశనం కానీకండి..

ఇది తప్పనిసరి.. అర్ధం చేసుకోండి..

–సాయి పద్మ

gay_rights_sign_by_The_Enabler

( గే ‘ల హక్కులు.. ఒక్కసారి ఆలోచిస్తే, చిన్న చిన్న గ్రామాల్లో, మనం చూడని చీకట్లలో, సమాజపు అలవాటు ప్రేమల్లో నలిగిపోతున్న.. అబ్బాయిలకు అంకితం…స్వలింగ సంపర్కులైన అబ్బాయిలకు వేరే అమ్మాయిలతో భారీ కట్నాలతో పెళ్లి చేస్తే.. నలిగిపోతున్న అమ్మాయిలకు.. అంకితం..)

3 thoughts on “మాకు…మేమే..!!

    • Srinivas Sathiraju అంటున్నారు:

      అమ్మా సాయి పద్మా

      నువ్వంటే నాకు ఒక విధమైన అభిమానము గౌవురవము. కానీ అనవసరమేమో అని పిస్తోంది. ఎవడో ఆడ మగ కానీ పిచ్హి మగ వెధవ పిలుపు నివ్వడం దానికి తగుదునమ్మా అనుకుంటూ ప్రతీ కుర్ర వెధవనుంచి నీలాంటి వాళ్ళ దాకా ప్రతీ బుర్ర చచ్హిన (మానసిక వైఫల్యం లేదా మెదడు వాపు వ్యాధితో ఆలోచన తాలుకు వివక్షత కోల్పొవడం. ప్రజా స్వామ్యమన్నాకా కొన్ని హద్దులు పరిమితులు ఉంటాయి. ఒక విషాయాన్ని చట్ట బద్ధత కల్పించాకా ఇస్టం లేక పొతే అనువైన చోటుకి పొయి మన ఇస్టం వచ్హినట్లు ఉండవచ్హు. ఇందులో ఎవరిని దోషులుగా నిలబెట్టనక్కరలేదు. కోట్లు తిన్న వాడు కంచు కోటల్లో ఉండి డబ్బు వెద జల్లి ఆడిస్తాడు. ఆడాలా వద్దా అనేది సమాజం పట్ల ఉండే అవగాహన విచక్షణ విశ్లేషణ కరువయ్యి మూకుమ్మడి దాడులు మొదలయ్యయి ఈ రోజుల్లో. ఈ కవిత అలాంటి మానసిక రోగుల మీద జాలి చూపేది గా లేదు. అందరు అలాంటి మానసిక రోగం చాలా గొప్పది మీకు పుణ్యం వస్తుంది ఇలాంటి రోగాలుంటే అసలు ఇలాంటి రోగం లేక పోవడమే పెద్ద రోగము అని విర్ర వీగడం నాకు మింగుడు పడని పరిణామం. అవయవలోపం ఎవరి తప్పు కాదు అలాంటి వాళ్ళ మీద జాలి సానుభూతి కన్నా సహానుభూతి చూపించండి తప్పకుండా ప్రతీ ఒక్కరు ముందుంటారు ఓదార్పుకి మార్పుకి. కానీ చెప్తున్నా వినకుండా వేషాలు వేస్తూ అడ్డమైన విషయాలు ( పొగ త్రాగడం, మద్య పానం స్త్రీ లోలత్వం మితిమీరిన కామం ఇత్యాది విషయాలు ఇప్పుడు కొత్తగా స్వలింగ సంపర్కం ఒకటి వచ్హింది) చాల గొప్పవని మంచి విషయాలను అసలైన మానసిక రోగాలుగా అభివర్ణిస్తూ రాసే పిచ్హి రాతలు ఎవరి మెప్పు పొందవు. ప్రజలే తిప్పి కొడతారు. కాకా పొతే ఆలోచనను ఆలోచనలతోనే ఎదుర్కోవాలి అనేది నా నమ్మకం అదే భరత జాతిలో హిందూ జీవన శైలి మానవ జాతి చరిత్రలో ఒక గొప్ప సనాతన సిద్ధంతంగా కాకుండా జాతి వెన్నెముకగా నిలవడం. మానవత్వం, మాటలతో మార్పును తీసుకు రావడము అనే అంశాలు ప్రపంచ మొత్తంలో మీకు ఎక్కడా దొరకని అతి గొప్ప మానవీయ నాగరిక లక్షణాలు. స్వలింగ సంపర్కం గురించి కూలంకషంగానే వివరించి దాన్ని పక్కకి పెట్టబడతం జరిగింది. దానికి ఆరొగ్య పరమైన కారణాలు శాస్త్రీయ నిబద్ధత సహెతుకంగా ఈ నాటి పాశ్చాత్య దేశాలు అన్ని నిరశిస్తున్నాయి. కుటుంబ జీవనం నాశనం చెయ్యొద్దని ప్రజలు మొత్తుకున్నా వినకుండా కొంత మంది పాలకులు నిర్ణాయాలు చేసినా ప్రజలు తిప్పి కొట్టి అలాంటి వారిని ఎంటదూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచుతున్నారు. ఇక భారత దేశంలో మీలాంటి వారు చెసే అసంబద్ధ ప్రయొగాలు అన్ని మతాలు కలిసి సమ్యుక్తంగా ఎదురుకుంటాయన్నది నమ్మకం. చివరిగా కుస్ఠు రోగం లాంటి భయానక వ్యాధులు వస్తే వారి మీద సానుభూతి చూపించే రక్త కన్నీరుకు ప్రజల సహకారం స్పందన ఉంటుంది. అది మానవత్వం. అలాగే కుంటి గుడ్డి మూగ చెముడు మానసిక చిత్త చాంచల్య వైఫల్యలు ఉన్న వారి మీద అందరికి జాలి సాను భూతి ఉంటుంది. అంతే కాని కుటుంబ వ్యవస్థ నాశనం చెసి సమాజంలో అంటు వ్యాధులు ఇతరత్రా సమస్యలు కలిగించ గల ఈ మహమ్మరిని ఎలుగెత్తి ఆహ్వానించి ఆవాహన చేసుకొని ఆలింగనం ఇమ్మనడం తప్పకుండా విచారించి వెలి వేయవలసిన విషయమే తప్ప ప్రాముక్యతను ఇవ్వ వలసిన విషయం ఎంత మాత్రం కాదు. మీ మీద నిజంగా జాలిగా బాధగా నిట్టూర్చడం తప్ప ఇంకేమీ చెయ్యలేము.

Leave a reply to Pvgk.viswanadham స్పందనను రద్దుచేయి