గాయాలు ….

Angry_Eyes

ఒక ముఖం..

ముఖం నిండా కళ్ళే..

వెంటాడే కళ్ళు..

నిందారోపణల ..అజమాయిషీ కళ్ళు..

అసూయల .. ఆనవాల్లాంటి కళ్ళు..

ముఖం నిండా కళ్ళే..

వెతుక్కునే నిద్రలో రానంటున్న కలల్లా..

కనుచూపు మేరా కళ్ళే..

ఆకలిగా.. వేటాడుతూ 

అధికారికంగా అభ్యర్ధిస్తూ..

అనుభవించిన హింసకి.. 

అహింస లా కనిపించే హింసా దృక్కులతో…

చప్పున కళ్ళు మూసుకోవాలి 

ఈ కళ్ళు లేని కాలాల తీరానికి ఆవల..

జాగ్రత్తగా కళ్ళు తెరవాలి..

4168645453_97ae84f60e

ఆరా తీసే కళ్ళు 

అభిమాన భంగం చేసే కళ్లు 

ఆ కళ్ళ ఆకళ్ళు తెలిసీ 

కాలిపోతూ భరించాల్సిన ఆ క్షణాలు 

భయానకం , బాధాకరం.. 

hypnosis_eyes_closed1

అందుకే చప్పున  కళ్ళు మూసేసుకోవాలి 

ఈ కళ్ళను చూడకుండా …

మూసేసుకోవాలి తప్పదు ఇక 

వీలైతే..బుధ్ధి, మనసు కూడా..

 

–సాయి పద్మ 

ప్రకటనలు

One thought on “గాయాలు ….

 1. shobha అంటున్నారు:

  “అనుభవించిన హింసకి..

  అహింస లా కనిపించే హింసా దృక్కులతో…

  చప్పున కళ్ళు మూసుకోవాలి

  ఈ కళ్ళు లేని కాలాల తీరానికి ఆవల..

  జాగ్రత్తగా కళ్ళు తెరవాలి….”………………… జాగ్రత్తగా కళ్లు తెరవాలి. లేకపోతే ఆ కళ్లు ఎప్పటికీ తెరచుకోకుండా చేసేయగలరు కూడా… ఆ అవకాశం మాత్రం ఎప్పటికీ ఇవ్వకూడదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s