మస్త ప్రయోగం…

artleaks

ఒకరినొకరు తోసుకుంటూ..

కీర్తి కాంక్షా జిజ్ఞాసులై 

అసిధారా వ్రతాలలో 

మేధావి గణం నెరిపే 

అనవరత  హస్తప్రయోగం 

 

తెలియకుండా ప్రతీది రణమే..

మనః సంయోగం లేని భావ ప్రాప్తిలా..

ప్రతీ చర్యా సంకల్పితమే..

ఇచ్చట కవులు, మేధావులు వండబడతారు..

అన్నీ దినుసులూ సరిగ్గా వేసినా 

రుచి తక్కువైన వంటలా..

ఘన లాంచనాలతో  పెళ్లి చేసినా..

తాంబూలం పండని జంటలా..

 

ఎవర్నీ తక్కువ చేయటానికి

వెనుకాడరు..అహం బ్రహ్మలు

వీలు కాకపోతే.. గత పండితుల 

సాహిత్యార్చనలో.. తమ పౌరోహిత్యం  చేస్తారు..

మానవత లేని ధార్మికత్వానికి..

మార్మికత్వ ముసుగు వేసి మళ్ళా 

శోభనం గదిలోకి తోస్తారు.. 

 

వాదాల , వేదాల , సిద్ధాంతాల బురుజులలో 

ఇరుక్కుని బూజు పట్టి పోతారు 

చిన్నవాళ్ళు రచిస్తే జీవితం చూడలేదంటారు..

పెద్దవాళ్ళ రాతల్ని .. కీర్తిశేషులయ్యాక …కీర్తిగానం చేస్తారు..

అన్నీ తెలిసిన సాహిత్య షరాబులు..

మెచ్చు’కొనాలంటే మాత్రం గీసి గీసి

గీటు రాళ్ళను అరగదీస్తారు

 

కులం, ప్రాంతం, వర్గం, వర్ణం, జాతుల వివక్షల విత్తనాలు 

సాహితీ మది చెక్కలలో చల్లుతారు..

భావజాలాల కంచెలు కట్టి కాపాడతారు 

పసలేని పరువపు పంటని.. ప్రశస్తిస్తూ గానం చేస్తారు..

అధవా నాణ్యత మిగలనీకుండా..మొదలంటా నరుకుతారు..

 

యవ్వన వనాల యవనికను అవసరమైనప్పుడే తీస్తారు..

మరీ మేధో విమర్శ వేళ్ళూనకుండా ముందే జాగ్రత్త పడతారు..

సరిగంచు చీర కట్టిన కవితమ్మను కూడా 

కొరకంచు చూపులతో కాల్చేయగల అసూయా శిఖరాలు వీరు..

 

హస్త ప్రయోగం మంచిదా కాదా.. అంటూ 

పుస్తకాల ని అమాయకంగా అడిగే వాళ్ళని చూస్తే 

నవ్వొచ్చేస్తుంది నాకు..

ఎన్ని మస్తకాల.. నగిషీ రాతల కుటిల  హస్త ప్రయోగాలలో..

అహాల చేతి వేళ్ళ కొసల గీతలలో

ఎన్ని మేధో ప్రయోగాలు…పురిటిలోనే ఆగిపోయాయో కదా..

రోజూ జరిగే ప్రయోగం.. మంచో చెడో.. మనకేం తెలుసు..???

2011-12-01-4511

సాయి పద్మ

ప్రకటనలు

2 Comments Add yours

  1. G.K.Subbarayudu అంటున్నారు:

    idi chaala powerfulgaa undi.. chadivi, Oho, anukodam tappa inkemii cheyya valasinadi ledu. Anaucityamani vadili pettey padaanni manchi metaphor ga vaadaaru. Good work.–Subbu

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s