గడిచేకొద్దీ…

ఎందుకింత స్తబ్దత..???

ఒకలాగే ఉండి, వడలి దొర్లుతున్న రోజులను చూసా..

రోజుల్లో ఒదిగిపోతూ..మనకి తలోగ్గుతున్న

నిస్సహాయ జేగంటల క్షణాలను చూసా..

ఏమో తెలీదు గానీ..

ఎన్నెన్ని పదాల దౌరుగల్లీలు

నా మెడ నిండా అలంకరించినా..

వ్యక్తావ్యక్త భావనల ప్రణయాలు..

పలకరించినా..

అలల నురుగులపై…వలపు నడకలు

నడిపించినా..

తగిలీ తగలని భూమి.. కర్తవ్యం గుర్తు చేస్తూనే ఉంది..

కొండమల్లెలాంటి మట్టి వాసన పలకరిస్తూనే ఉంది..

మట్టి ముట్టుకొని చాన్నాళ్ళయ్యింది..

ఏ ప్లాస్టిక్ పూల మురుగు తగలకుండా..

నిజమైన మనిషి స్పర్శ తడిమి యుగాలైంది..

అహాల చెలియలికట్ట దాటని.. అంతరంగాల మధ్య..!!

–సాయి పద్మ

ప్రకటనలు

One thought on “గడిచేకొద్దీ…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s