నీ ఆత్మకో నిష్టూర లేఖ..

mother_daughter_symbol 

నులపల పురికొస తాడులా..

నులి తిరుగుతోంది

నువ్వు లేవన్న నిజం..

అబద్ధమైతే బాగుణ్ను

అసలు నువ్వు నిజానికి నిలబడితే ఇంకా బాగుణ్ణు

నేనంటూ నిలబడితే భళిగా  ఉండును ..

అసలు బాగానే ఉండేదానివి కదూ..

నీ అస్తిత్వాన్ని నిలువునా నలిపెసిన

ప్రేమ..

పల్చని తెర నుండి… బాధా బెంగల అడ్డుగోడలా 

మారనంత వరకూ..

నాకెప్పటికీ అర్ధం కాని..

నీ వాదాలూ..వేదనలూ రెండు..

నీ ప్రేమ, కర్మ సిద్ధాంతాలు..

నీ ప్రేమ సిద్ధాంతాన్ని నేనిప్పుడు రాద్ధాంతం చేయబోను గానీ..

నాకో విషయం చెప్పు..

తమని తాము ప్రేమించుకోలేని వాళ్ళు..

ఇతర్లని ప్రేమించగలరా…??

మన దగ్గర లేనిది దానం ఇవ్వటం..

దానికోసం బలవ్వటం …

ఆనందానికి అర్హులం కామనుకోవటం..

ఇవన్నీ ప్రేమ లక్షణాలయితే

ప్రేమంటే.. భయమేస్తోంది..

ప్రేమికులు పిచ్చివాళ్ళు.. వాళ్ళని నిందించకు అన్నావోసారి

పిచ్చివాళ్ళకి ప్రేమ కేవలం వ్యక్తి పరం కాదుగా…

ప్రేమలో వాళ్లకి ఆశాభంగం లేదు..

మరి పిచ్చివాళ్ళు ఎలా అవుతారు?

గది గదికీ గడియ గడియకీ….

నువ్వు గతాన్ని మనసు గోతానికి కట్టి మరీ

అగాధంలోకి జారుతున్నావేమో  గమనించుకో..

కొంచం సమయమించుక…

అన్నీ… సహించక..

నీ ప్రేమ బానిసత్వంతో పాటు..

ఎన్నో బాంధవ్యాలు…స్నేహితాలు…

ఎన్నో సహజాతమైన  స్వతంత్రాలూ

కూడా.. నీ అస్తిత్వంలా సమాధి కావటం లేదూ..

రక్తం చిందని ఇంత హింసకి

ప్రేమ అనే పేరు కూడా అంతగా నప్పటం లేదు..

ఎన్ని కళలు చిద్రమైతే ఒక ప్రేమ ..విజయవంతమవుతుంది..

ఎన్ని కాలాల్లో ఇమడని జీవితాలు.. నాశనమైతే

నీ ప్రేమ యోగం…మనః నిర్యాణమవుతుంది..??

 

ఒక్కసారి.. చెప్పకూడదూ..

చితి నుంచెం ఖర్మ…చరిత్ర పుటల  వెనుక నుండి..

జ్ఞాతల .. వెతల.. వెసులుబాట్ల నుండీ..

నీ సిద్ధాంతాలన్నింటినీ  ఒప్పుకుంటాను…!!

–సాయి పద్మ

ప్రకటనలు

2 Comments Add yours

  1. padmarpita అంటున్నారు:

    అద్భుతంగా రాసారు….

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s